నందమూరి కొత్త సినిమా మోనార్క్ బోయపాటి డైరెక్షన్లో కొంత పార్ట్ షూటింగ్ చేసుకుంది. ఈ మూవీ ఈపాటికి కంప్లీట్ కావాలి కానీ కరోనా మహమ్మారి విరుచుకుపడడం, లాక్ డౌన్ తో మొత్తం షెడ్యూల్ తల్లకిందులు అయింది.

 

ఇక ఇపుడు మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టాలి. ఈ సినిమా తొలి షెడ్యూల్ ని కాశీలో చేసారు.  మరింత షూటింగ్ కూడా అక్కడే ఉందని అంటున్నారు. అయితే ఇపుడు లాక్ డౌన్ ఎత్తేసినా కూడా షూటింగ్ అక్కడ సాధ్యపడుతుందా అన్న డౌట్లు ఉన్నాయి. సరే ఆ విషయం అలా ఉంచితే ఈ మూవీలో బాలయ్య అఘోరా లాంటి ఒక పాత్ర వేస్తున్నారు. అది ఈ  సినిమాకు ఆయువు పట్టు అంటున్నారు.

 

దాంతో పాటు మరో పాత్ర ఫుల్ యాక్షన్ మాస్ తో మిక్స్ అయి ఉంటుందిట. ఈ మూవీలో రెండవ పాత్రకు ఆటా పాటా అన్నీ ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని అంటున్నారు. అయితే ఇప్పటిదాకా వినిపించిన విషయం ఏంటి అంటే ఇద్దరు కొత్తవారిని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తారని, అయితే ఇపుడు మరో మాట వినిపిస్తోంది.

 

ఇద్దరూ కొత్తవారు అయితే సినిమాకు హైప్ రావడం కష్టమని, పైగా కమర్షియల్ లుక్ ఉండదని, పాజిటివ్ బజ్ రావాలంటే ఒక హీరోయిన్ని కచ్చితంగా స్టార్ ఇమేజ్ ఉన్న వారిని తీసుకోవాలని చర్చిస్తున్నారుట. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

 

నిజానికి బాలయ్య పక్కన అంటూ చాలా పేర్లు ఇప్పటిదాకా చక్కర్లు కొట్టాయి. ఉత్తరాదిభామ సోనాక్షీ సిన్హా  నుంచి తమన్నా, రకుల్, కాజల్, పాయల్ ఇలా ఎందరి పేర్లో న్యూస్ గా వచ్చాయి. ఇక ఇపుడు వారు ఎవరూ కాకుండా మళ్ళీ హీరోయిన్ వేట మొదలుపెడతారు అంటున్నారు. అదే జరిగితే ఈ సినిమాకు మరింత లేట్ జరుగుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా బాలయ్య మూవీలో హీరోయిన్లు మళ్లీ ప్రాబ్లంగా మారుతున్నారా అన్నదే పాయింట్ గా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: