సూపర్ స్టార్ మహేష్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి  జగన్నాథ్ కాంబినేషన్ లో మూవీ అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అప్పటిదాకా ప్రిన్స్ గా ఉన్న మహేష్ ను సూపర్ స్టార్ ను చేసిన సినిమా పోకిరి. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన పూరి మళ్ళీ మహేష్ తో బిజినెస్ మెన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు.  అయితే ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ కోసం పూరి జనగణమన  సిద్ధంగా ఉన్నాడు. మహేష్  టైం ఇవ్వాలే కాని ఆ కథ వినిపించాలని చూస్తున్నాడు పూరి. 

 

ఇదిలాఉంటే మొన్నామధ్య మహేష్ కేవలం హిట్టు డైరక్టర్స్ కే ఛాన్స్ ఇస్తాడని పూరి కామెంట్ చేశాడు. అయితే అవేవి మనసులో పెట్టుకోకుండా పూరితో సినిమా ఎప్పుడని మహేష్ ని ఫ్యాన్స్ అడిగితె ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే అంటూ చెప్పుకొచ్చాడు. పూరి ఆల్రెడీ జనగణమన కథ సిద్ధం చేసుకుని ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు పూరి. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 

 

పూరి చేస్తున్న విజయ్ సినిమా హిట్టు కొడితే మహేష్ ఛాన్స్ పట్టేసినట్టే. అయితే ఒకవేళ మహేష్ ఛాన్స్ ఇస్తానన్నా.. సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే రాజమౌళి సినిమా ఉంటుందని తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా రెండేళ్లు కనీసం రాసి ఇవ్వాల్సిందే. అంటే ఎలా లేదన్నా పూరితో సినిమా ఉన్నా అది మూడేళ్ళ తర్వాత మాటే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లేట్ అయినా సరే మహేష్ తోనే పూరి జనగణమన సినిమా చేయాలని కోరుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: