సినిమా అంటే విపరీతమైన ఇష్టం చూపే దేశం మనది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకూ అన్ని వర్గాల్లో క్యూరియాసిటీనే. రిలీజ్ రోజు ఓపెనింగ్ షో పడే వరకూ అభిమానుల హంగామానే. టికెట్ల కోసం క్యూలు, ఫ్యాన్స్ హంగామా, ధియేటర్లలో ఈలలు, చప్పట్లు, ఫ్యామిలీలు, సందడి.. ఇలా ఒకటేమిటి. సినిమా అంటే ధియేటర్లలో సందడే సందడి. ప్రస్తుతం ఈ సరదా అంతా ఆగిపోయింది. కరోనా వచ్చి అందరినీ ఇళ్లలో ఉంచేసింది. ధియేటర్ వైపు కాదు కదా.. కనీసం కొత్త పోస్టర్ చూసే దాదాపు రెండున్నర నెలలు కావొస్తోంది. లాక్ డౌన్ తో మొత్తం ధియేటర్లన్నీ మూతపడ్డాయి.

 

మరికొన్ని రోజుల్లో ధియేటర్లు తెరుస్తారనే ఊహాగానాల మధ్య చాలా చోట్ల ధియేటర్ల రెనోవేషన్ ప్రారంభమయింది. వరుసల్లో పక్కపక్కనే ఉండే సీటింగ్ ను మార్చేస్తున్నారు. సీటు సీటుకు మధ్య గ్యాప్ వచ్చేలా కొత్త సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్ ఇప్పటికే ఈ పనులు ప్రారంభించినట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో సీట్ సీట్ మధ్య సీట్ గ్యాప్ ఉంది. ఈ ఏర్పాట్లతో ప్రభుత్వం సంతృప్తి చెందితే అనుమతులు వస్తాయి. మరి ఈ ఏర్పాట్లన్నీ గతంలోలా ప్రేక్షకుల్ని రప్పిస్తాయా అనేదే అనుమానం.

 

అయితే.. సీట్ల మధ్య ఎడం పెంచితే సరిపోతుందా. సినిమాకు వెళ్లేటప్పుడు హడావిడి ఉండదా.. ఇంటర్వెల్ లో జనం గుమిగూడరా.. వాష్ రూమ్ వద్ద పరిస్థితేంటి అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. స్టార్ హీరో సినిమా అయితే ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. వీరినెలా ఆపుతారు. సింగిల్ ధియేటర్ రెనోవేషన్ సరే.. మల్టీప్లెక్స్ సంగతేంటి. మల్టీప్లెక్స్ ల్లో కూడా సీట్ల రెనోవేషన్ కంపల్సరీగా చేయాల్సిందే. అందరిలోనూ ఉన్న ప్రశ్నేంటంటే ప్రేక్షకులు గతంలోలా ధియేటర్లకు వస్తారా అనేదే..!

మరింత సమాచారం తెలుసుకోండి: