కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో పాగా వేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిన్న పాత్రతో మెప్పించిన విజయ్ సేతుపతి మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్న ఉప్పెన సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో మరో క్రేజీ మూవీ రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను రాజు కనుకూల డైరెక్ట్ చేయబోతున్నారట. విజయ్ సేతుపతితో పాటుగా ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. 


ఇద్దరికీ సినిమాలో మంచి పాధాన్యత ఉన్న పాత్రలు పడ్డాయట. సినిమా సబ్జెక్ట్ కూడా చాలా ఎక్సయిటింగ్ గా ఉందని తెలుస్తుంది. కథ నచ్చడంతో ఈ సినిమాను తమిళ, మళయాళ భాషలతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ సేతుపతి తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అందుకే తను చేస్తున్న సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేసేలా పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడు. 


మూడు భాషల్లో రిలీజ్ చేసేలా కథ సిద్ధం చేశాడంటే తప్పకుండా సినిమా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. విజయ్, ఫాహద్ ఫాజిల్ ఇద్దరు ఈ సినిమాతో సర్ ప్రయిజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ అందుకే క్రూ త్వరలో వెళ్లడిస్తారు. సినిమాలో హీరోయిన్స్ కూడా స్టార్స్ ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ మంచి హోప్స్ తో ఉన్నారు.                     

 

మరింత సమాచారం తెలుసుకోండి: