కోలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అదే రేంజ్ క్రేజ్ ఉన్న హీరో విజయ్. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మాదిరిగా కోలీవుడ్ లో విజయ్ గత రెండు మూడు సంవత్సరాలుగా వరస హిట్స్ ని అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నాడు. తను నటించిన ప్రతి సినిమా ఖచ్చితంగా వంద కోట్లు వసూళ్ళు రాబట్టంతో విజయ్ గ్రాఫ్ ఒకేసారి తారా స్థాయికి చేరుకుంది.  ఇక విజయ్ తాజా చిత్రం మాస్టర్. ఈ సినిమాని పక్కా కమర్షియల్ హంగులతో భారీ సినిమాగా రూపొందిస్తున్నారు. ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్న విజయ్ కి కరోనా బ్రేక్ వేసింది. ఇక వాస్తవంగా మాస్టర్ సినిమాని గత నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అందుకే రిలీజ్ కి ముందే సినిమాను 200 కోట్లకు అమ్మేశారు.

 

అయితే ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమలలో లాక్ డౌన్ కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో మాస్టర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో  తెలియడం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ సినిమా 2020 లో రావడం సాధ్యం కాదని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోందట.  ఈ నేపథ్యంలో మాస్టర్ చిత్రంను కొనుగోలు చేసిన బయ్యర్లు తాము పెట్టిన మొత్తంను వెనక్కు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అన్ని నెలలు వడ్డీ తో పాటు సినిమా రిలీజైనా జనాలు థియోటర్స్ కి రాక కనీసం పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుందో లేదో అన్న భయం పట్టుకుందట.

 

ఎప్పటి లాగే సినిమాలు లాభాలు పొందాలంటే ఖచ్చితంగా ఏడాది పైనే పడుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఎక్కువ శాతం బయ్యర్లు తాము పెట్టిన మొత్తంను ఇవ్వాల్సిందిగా నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ఈ విషయంలో కొంతమంది బయ్యర్లు విజయ్ మీద ఒత్తిడి తెస్తున్నారట. అయితే ఇప్పుడు అయిన 200 కోట్ల బిజినెస్ తిరిగి వెనక్కి ఇచ్చేస్తే మళ్ళి ఆ స్థాయిలో బిజినెస్ కావడం అసాధ్యమని అలా జరిగితే భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: