టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేశాడు దగ్గుబాటి హీరో. ఈ నేపథ్యంలో ఈ మధ్యే ఇరు  కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక త్వరలోనే రానా మిహీక నిశ్చితార్ధం జరపనున్నారు. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం అన్ని అనుకూలిస్తే వచ్చే ఆగస్ట్ నెలలో ఘనంగా పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. అయితే రోకా ఫంక్షన్ సందర్భంగా ఈ ఏడాదిలోపే రానా మిహీక పెళ్లి చేస్తామని సురేష్ బాబు తెలియజేశారు. 

 

వాస్తవంగా అయితే నవంబర్ లేదా డిసెంబర్ లో పెళ్ళి జరిపించాలని అనుకున్నారు. కాని అప్పటి వరకు అంటే చాలా ఆలస్యం అవుతుందన్న కారణంగా ఆగస్టు లో చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పటి నుంచే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోనే అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో రానా మిహీకాల వివాహం జరపనున్నారట. అయితే తాజాగా వీరి పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదే రానా మిహీకాల వివాహానికి ఆగస్ట్ 8 డేట్ ని ఫిక్స్ చేశారని. 

 

అంతేకాదు రానా మిహీకల పెళ్లి ముచ్చటగా మూడు రోజుల పాటు జరగనుందని ఆగష్టు 6, 7, 8 తేదీలలో పెళ్లి ఫిక్స్ చేశారని... 6, 7వ తేదీలలో వేడుకలు మొదలు పెట్టి 8న పెళ్లి ముహూర్తం నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో రానా తండ్రి సురేష్ బాబు క్లారిటీ ఇస్తూ..ఇప్పటి వరకు రానా మిహీకల పెళ్లి తేదీని ఫిక్స్ చేయలేదని తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్నట్టు గా ఆగష్టు 8 వ తేదీ మంచిదైతే ఆ రోజే ఫిక్స్ చేస్తాము. కాని ఇంకా ప్రత్యేకించి ఏ డేట్ అనుకోలేదని తెల్లడించారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: