బాలయ్య బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. తమ అభిమాన హీరో త్వరలోనే  సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా  కనిపిస్తుంది. బాలకృష్ణ కు ఇప్పటివరకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్ లు లేవు అయితే  త్వరలోనే ఓ స్పెషల్ సాంగ్ ద్వారా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తానని ఆ పాటను కూడా తానే పాడుతానని బాలయ్య తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించాడు కాగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చాడు అంతేకాదు సామజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా వుంటూ చిరు తన అభిమానులకు మరింత దగ్గరయ్యాడు త్వరలోనే బాలయ్య కూడా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండనున్నాడు. 
 
ఇదిలావుంటే ప్రస్తుతం బాలకృష్ణ ,బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మూడో సారి నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి మోనార్క్ అనే టైటిల్ ను పెట్టనున్నారట. బాలకృష్ణ బర్త్ డే రోజు జూన్ 10న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదలచేసే అవకాశాలు వున్నాయి. ఇటీవల ఈచిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ జూన్ చివర్లో ప్రారంభం కానుంది.  
 
థమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి  నిర్మిస్తున్నాడు. ఈసినిమా లో బాలయ్య కు జోడిగా ఓ కొత్త హీరోయిన్ ను తీసుకున్నారు. త్వరలోనే ఆ హీరోయిన్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇంతకుముందు బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ, లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్లు కావడంతో మోనార్క్ పై భారీ అంచనాలు వున్నాయి. డిసెంబర్ లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: