సినిమాకు సంగీతం ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. ఎన్నో సినిమాలను పాటలు నిలబెట్టిన సంగతి తెలిసిందే. సినిమాలో మంచి పాటలు కోసం ట్యూన్ ఇవ్వటం వేరు.. సినిమా థీమ్ ను బట్టి సంగీతం ఇవ్వటం వేరు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే ఇళయరాజా. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఎన్నింటికో అద్భుతమైన సంగీతం ఇచ్చారు. చిరంజీవి స్టెప్పులను గ్రహించే సంగీతం ఇచ్చినట్టే ఉండేవి. అభిలాష సినిమాలో ‘యురేకా సకమికా..’ అనే పాటే ఇందుకు ఉదాహరణ. ఆపాటలో ఉన్న స్పీడ్, బాలు గానం ఒకెత్తయితే చిరంజీవి తన యాక్టివ్ నెస్ తో స్టెప్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు.  

IHG

 

రాక్షసుడులో ‘అచ్చా.. అచ్చా’ పాట సూపర్ హిట్. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ పాట ఇప్పటికీ ప్రతి పెళ్లి వేడుకలో మోగాల్సిందే. మరణమృదంగంలో 'కరిగిపోయాను కర్పూర వీణలా'.. రుద్రనేత్ర సినిమా ఫ్లాప్ అయినా పాటలన్నీ సూపర్ హిట్టే. కొండవీటిదొంగలో ‘శుభలేఖ రాసుకున్నా..’ పాటను ఇప్పటి ఏ సంగీత అభిమాని మర్చిపోడు. ‘చమకు చమకు చాం’ పాటకు స్లో మ్యూజిక్ ఇచ్చి చిరంజీవితో డ్యాన్సుల్లో మ్యాజిక్కే చేశారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సంగీతం పరంగా ఓ మలయమారుతం. అద్భుతమైన సంగీతానికి ఈ సినిమా నిలయం. ప్రతి పాటా సినిమాలో సన్నివేశానికి తగ్గట్టే ఉంటుంది.

IHG

 

‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అనే పాట ఇప్పటికీ చార్ట్ బస్టర్. ఆ పాటకు ధియేటర్లలో తెరపై డబ్బులు విసిరారు. ‘అందాలలో..’ పాట నిజంగా హిమాలయాల్లో దేవకన్య వచ్చి పాడినట్టే ఉంటుంది. ‘ప్రియతమా..’ పాట ప్రేయసీ ప్రియుల ప్రణయ గీతంలా ఉంటుంది. ‘జై చిరంజీవా..’ పాట సినిమాలో ఓ అద్భుతం. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ లో కూడా పాటలన్నీ వీనులవిందుగానే ఉంటాయి. ఈస్థాయిలో హిట్ అయిన పాటలకు, సాహిత్యానికి, చిరంజీవి డ్యాన్సులకు మూలం ఇళయరాజా సంగీతమే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: