టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో గొప్పగా నిర్మించనున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్నిఆ అందిస్తున్నాడు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మొన్న ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు నిర్మాతలు. 

 

కాగా ఆ పోస్టర్ కు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి కూడా భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ లభించడం జరిగింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ 24 గంటల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ తో పాటు పలు రికార్డ్స్ నమోదు చేసింది. అయితే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వెనుక కొంత మ్యాటర్ దాగి ఉందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా గ్యాప్ తరువాత మంచి మాస్ పాత్రలో కనపడనున్నట్లు చెప్తున్నారు. మంచి రఫ్ గా సాగే ఆ పాత్ర కోసం మహేష్ కొంత జుట్టును పొడుగ్గా పెంచడంతో పాటు మాస్ స్టైల్ కాస్ట్యూమ్స్ లో కనపడనున్నారట. 

 

అయితే తమ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండనుందో ప్రేక్షకులకు తెలియడానికి ఫస్ట్ లుక్ లోనే హీరో లోనే మాస్ స్టైల్ ని తెలియచేసేలా మెడ పై రూపాయి టాటూ, చెవికి స్టైలిష్ పోగు, అలానే పొడుగాటి జుట్టు పెంచిన లుక్ ను వెనుక నుండి రిలీజ్ చేయడం జరిగిందట. మంచి మెసేజ్ తో పాటు అలరించే పలు కమర్షియల్ హంగులు, ముఖ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ వంటి పలు అంశాల కలయికగా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో పూర్తిగా సినిమాని మన దేశంలోనే తీసేలా ఇప్పటికే పలు ప్రాంతాలను ఎంపిక చేసిందట సినిమా యూనిట్. అతి త్వరలో లాక్ డౌన్ అనంతరం సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా, షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: