సంగీత దిగ్గజం మెయిస్ట్రో ఇళయరాజా గురించి మన తెలుగు వారికి సైతం పెద్దగా పరిచయం అవసరం లేదు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా ఇప్పటికీ మంచి సాంగ్స్ ఇస్తూ కొనసాగుతున్న ఇళయరాజా హవా కొన్నేళ్ల క్రితం పీక్ స్టేజెస్ లో ఉండేది. చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా దాదాపుగా ప్రతి ఒక్క దర్శకుడు, హీరో కూడా ఇళయరాజా మ్యూజిక్ తమ సినిమాకు కావాలని కోరుకునే వారు. ఆ విధంగా ఎంతో బిజీ బిజీగా వందలాది సినిమాలకు సంగీతం అందించిన ఇళయరాజాతో మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఎంతో మంచి అనుబంధం ఉన్నప్పటికీ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాలకు ఇళయరాజా అందించిన వండర్ఫుల్ సాంగ్స్ ని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటికీ కూడా మరిచిపోలేరు అనే చెప్పాలి. 

IHG

ముఖ్యంగా చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలైన రాక్షసుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అభిలాష, కొండవీటి దొంగ, మంత్రి గారి వియ్యంకుడు, ఛాలెంజ్, ఆరాధన, రుద్రవీణ, సినిమాల్లోని పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనాలి. అప్పట్లో మెగాస్టార్, ఇళయరాజాల కాంబోలో వచ్చిన ఈ సాంగ్స్ సూపర్ హిట్ కొట్టడంతో అపాటు ఆయా సినిమాల విజయాలలో కీలకపాత్ర వహించాయి అనే చెప్పాలి. ఇకపోతే ఆ తరువాత కూడా మెగాస్టార్ నటించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ అందించారు ఇళయరాజా. 

IHG

ఎక్కువగా తనవద్దకు అప్పట్లో కథలతో వచ్చే దర్శకులకు మెగాస్టార్ ఇళయరాజా పేరును సజెస్ట్ చేసేవారని, అలానే ఆయా కథకులు, దర్శకలు కూడా అప్పటికే మెగాస్టార్ తో ఇళయరాజా కు మంచి ర్యాపొ ఉండడంతో ఆయననే సంగీత దర్శకుడిగా తీసుకోవడానికి మొగ్గుచూపేవారని సమాచారం. ఇకపోతే వీరిద్దరి కాంబోలో అప్పట్లో సినిమా వస్తుందంటే చాలు అటు మెగా ఫ్యాన్స్, ఇళయరాజా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సాంగ్స్ పట్ల విపరీతమైన అంచనాలు ఉండేవి. ఆ విధంగా ఇళయరాజాతో మెగాస్టార్ పని చేసిన దాదాపుగా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టి, వారి కంబోకు తిరుగులేదని చాటి చెప్పాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: