తెలుగు తో పాటు పలు ఇతర భాషల సినిమాలకు కూడా ఎన్నో గొప్ప గొప్ప సాంగ్స్ కంపోజ్ చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి మన భారత దేశంలోని ప్రజలందరికీ ఎంతో సుపరిచితం. అటు హిందీలో కూడా కొన్ని సినిమాలకు అద్భుతమైన సాంగ్స్ అందించిన ఇళయరాజాకు ఇటు సౌత్ లో మాత్రం మరింత గొప్ప పేరుంది. తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆయన సంగీతాన్ని ఎంతో గొప్పగా ఆదరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మన తెలుగులో కూడా పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన గొప్ప చరిత్ర ఇళయరాజాది. 

IHG

అప్పటి స్టార్ హీరోలతో పాటు మిగతా ఇతర హీరోల సినిమాలకు సైతం అలరించే సాంగ్స్ అందించిన ఇళయరాజా మ్యూజిక్ లో ఉండే ఫీల్ నిజంగా ఎంతో అద్భుతం అని, మంచి మెలోడీ సాంగ్స్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి అని ఇప్పటికీ ఎందరో సంగీత ప్రియులు అంటుంటారు. ఇకపోతే ఎక్కువగా తాను మ్యూజిక్ మాత్రమే కంపోజ్ చేసే అలవాటున్న ఇళయరాజా, మధ్యలో చాలా చాలా తక్కువ సార్లు మాత్రమే తన గాత్రంతో స్వయంగా పాటలు ఆలపించడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగులో అయితే కొన్నేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్, టబు ల కలయికలో వచ్చిన కూలి నెంబర్ వన్ సినిమాలోని కలయా నిజమా అనే సాంగ్ పాడారు ఇళయరాజా. ఆ తరువాత ఇటీవల సచిన్ జోషి, భావన కలిసి నటించిన నినుచూడక నేనుండలేను సినిమాలోని కొమ్మల్లో కోయిల అనే సాంగ్ ని కూడా పాడడం జరిగింది. 

IHG

అయితే ఈ రెండు సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా అలరించినప్పటికీ ఇళయరాజా మాత్రం ఆపై తెలుగులో స్వయంగా సాంగ్స్ పాడలేదు. నిజానికి తన సాంగ్స్ ని ఇతరుల గొంతుక నుండే వినడానికి ఇష్టపడే ఇళయరాజా, ఆపై అక్కడక్కడా పలు భాషల్లో మాత్రం తన గాత్రంతో ఆయన పాటలు పాడారు. కానీ ఎందుకో తన గాత్రం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఇళయరాజా సంగీత దర్శకుడిగా సాంగ్స్ కంపోజ్ చేయడానికే ఇష్టపడేవారు. మరి రాబోయే రోజుల్లో అయినా ఇళయరాజా మళ్ళి మరొక్కసారి తన స్వయం గాత్రంతో పాటలు పాడి ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి.....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: