ఒక యంగ్ హీరోకి అతడు నటించిన తొలి సినిమా నుండి వరసగా మూడు ఫ్లాప్ లు వస్తే కనీసం మరొక అవకాశం ఇవ్వడానికి కూడ నిర్మాతలు బెదిరిపోతారు. అయితే యంగ్ హీరో అఖిల్ పరిస్థితి వేరు. అక్కినేని మనవడుగా నాగార్జున కొడుకుగా ఏర్పడిన కుటుంబ వారసత్వం అఖిల్ కు ఎంతగానో సహకరిస్తోంది.


ఇలాంటి పరిస్థితులలో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈమూవీ ఈసమ్మర్ లో విడుదల కావలసి ఉంది. అయితే కరోనా వల్ల ధియేటర్లు మూత పడటంతో ఈమూవీ విడుదల కూడ ఆగిపోయింది. దీనితో అఖిల్ దురదృష్టం అంటూ కొందరు కామెంట్స్ కూడ చేసారు.


అయితే ఇలా సినిమా విడుదల ఆగిపోవడం నాగార్జున ఒక అదృష్టంగా భావిస్తున్నాడట. ఈసినిమా అఖిల్ కెరియర్ కు అత్యంత కీలకమైంది కావడంతో నాగార్జున ఈ లాక్ డౌన్ సమయం వల్ల వచ్చిన ఖాళీతో ఇప్పటికే చిత్రీకరణ ఇంచుమించు పూర్తి చేసుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ఔట్ పుట్ ను తెప్పించుకుని రఫ్ ఎడిటింగ్‌‌ లో ఉన్న సినిమా పూర్తిగా చూసి సంతోషం వ్యక్తం చేశాడట.


అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో మాత్రం కొన్నిమార్పులు చేయమని దర్శకుడికి చెప్పాడట నాగార్జున. దీనితో నాగార్జున సూచించిన మార్పులకు అనుగుణంగా దర్శకుడు భాస్కర్ వెర్షన్‌ ను తయారుచేసి నాగార్జునకు ఈమధ్యనే చూపించాడని టాక్. ఈ ఫైనల్ అవుట్ పుట్ చూసి నాగార్జున ఆనంద పడటమే కాకుండా ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్ననమ్మకం తనకు ఉంది అని చెప్పడమే కాకుండా ధియేటర్లు మళ్ళీ ఓపెన్ అయిన తరువాత ఒక మంచి రిలీజ్ డేట్ చూసుకుని ఈ మూవీని విడుదల చేద్దాం అని చెప్పినట్లు టాక్. ఇలా కరోనా అఖిల్ కు పరోక్షంగా సహకరించింది అంటూ కొందరి కామెంట్స్..   

మరింత సమాచారం తెలుసుకోండి: