‘బాహుబలి’ ఘనవిజయం తరువాత టాలీవుడ్ ఫిలింఇండస్ట్రీకి సంబంధించి ఒక్క మహేష్ కు తప్ప అందరి చూపు బాలీవుడ్ పై పడటంతో టాప్ హీరోలు అందరు తమ కొత్తసినిమాలను పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్స్ గా మార్చివేసారు. అయితే ఎవరు ఊహించని విధంగా కరోనా మహమ్మారీ విలయతాండవం చేసి ఫిలిం ఇండస్ట్రీలో ఊహించని విపత్తులు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు భారీ బడ్జెట్ లతో డిజైన్ చేయపడ్డ మన తెలుగు హీరోల పాన్ ఇండియా సినిమాల ఖర్చు ఎలా తగ్గించాల అన్నఆలోచనలు మొదలయ్యాయి.


‘బాహుబలి’ ఘనవిజయం తరువాత తెలుగు అగ్ర హీరోలంతా పాన్ ఇండియా మ్యానియాతో రెచ్చిపోతు తమ సినిమాలు కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తమను తాము నిరూపించుకోవాలన్న కసితో తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే యూనివర్శల్ కథాంశాలను ఎంచుకుని భారీసినిమాలకు లైన్ క్లియర్ చేసారు. వీటిలో ఇప్పటికే చాలవరకు కరోనా ఉపద్రవం ముందే ప్రారంభం అయ్యాయి.


ప్రస్తుతం టాలీవుడ్ నుండి సుమారు డజను పాన్ ఇండియా సినిమాలు నిర్మాణంలో ఉన్నాయంటే మన హీరోల పాన్ ఇండియా మ్యానియా అర్థం చేసుకోవచ్చు. వీటిలో జూనియర్ చరణ్ ల ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రభాస్ రాథా కృష్ణల ‘ఓ డియర్’ అల్లు అర్జున్ ‘పుష్ప’ పవన్ కళ్యాణ్ క్రిష్ ల ‘విరూపాక్ష’ రానా ‘హాతీ మేరా సాథీ’ విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ తో పాటు ఆఖరికి   మంచు మనోజ్ ‘అహం బ్రహ్మస్మి’ మూవీని కూడా పాన్ ఇండియా మూవీగా ప్రకటించారు. అదేవిధంగా కొరటాల చిరంజీవిల ‘ఆచార్య’ మహేష్ పరశు రామ్ ల ‘సర్కార్ వారి పాట’ కూడ రెండు మూడు భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉంది అనిఅంటున్నారు.


కరోనా పరిస్థితుల తరువాత మారిన పరిస్థితులలో జనం థియేటర్స్ కు వస్తారా ? రారా అన్నప్రశ్నలు వెంటాడుతున్న పరిస్థితులలో ఇండియన్ ఫిలిం మార్కెట్ లో తెలుగుసినిమాలకు సంబంధించి ఇన్ని పాన్ ఇండియా సినిమాలకు మార్కెట్ ఉంటుందా అన్నసందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇలాంటి పరిస్థితులలో ఇన్ని పాన్ ఇండియా మూవీలను భారీ రేట్లకు మోజుపడి కొనుక్కునే బయ్యర్లు ఎక్కడదొరుకుతారు బయ్యర్లు ముందుకు రాకపోతే ఇన్ని భారీ తెలుగు సినిమాల పై పెట్టు బడిపెట్టిన నిర్మాతల వేలకోట్ల పరిస్థితి ఏమిటి అన్నవిషయమై ఇండస్ట్రీ వర్గాలలో లోతైన చర్చలు జరుగుతున్నాయి. దీనితో మన టాప్ హీరోలు రాంగ్ టైమ్ లో పాన్  ఇండియా ప్రయోగాలు చేస్తున్నారు అంటూ కొందరు అభిప్రయా పడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: