క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. లోకల్ సినీ శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు వంద శాతం ఇండియాలోనే షూట్ చేయబోతోన్నారని.. మన లొకేషన్స్ లో తెరకెక్కబోతున్న లోకల్ సినిమా అని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. 'పుష్ప' సినిమాని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊర మాసు.. మొరటు కుర్రాడిగా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం.

 

కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అక్కగా ఒక ప్రముఖ యాంకర్ నటించబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో పుష్పక్ నారాయణకు అక్కగా యాంకర్ రంగమ్మత్త అనసూయ బన్నీకి సిస్టర్ గా నటిస్తోందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సుమ ఈ క్యారెక్టర్ ప్లే చేస్తోందని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. మళ్ళీ ఇప్పుడు యాకర్ అనసూయ పేరు లైన్లోకి వచ్చింది. ఆల్రెడీ 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా అద్భుతమైన నటన కనబరిచిన యాంకర్ అనసూయ వైపే సుకుమార్ మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్మాల్ స్క్రీన్ పై పోటాపోటీగా యాకరింగ్ చేసే వీరిద్దరిలో ఎవరిని పుష్పక్ నారాయణ అక్కగా ఫైనలైజ్ చేసారో అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: