ఓ ఇంటర్‌నేషనల్‌ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ హాట్ బ్యూటీ పమేలా ఆండ్రసన్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌ చేసింది. ఈ మధ్య సినీ తారల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకుల వార్తలు తరచూ హల్‌ చల్ చేస్తున్నాయి. ఇండియన్‌ సినిమాలో కాస్త తక్కువే అయినా హాలీవుడ్‌ లో ఈ వార్తలు మరింత కామన్‌గా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా హాలీవుడ్‌ క్రేజీ స్టార్స్‌ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవటం వార్తల్లో తరుచూ వినిపిస్తుంటుంది.

 

ఈ నేపథ్యంలో పమేలా మాట్లాడుతూ.. తన గత బంధాలతో పాటు భవిష్యత్తులో తాను మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వివరించింది పమేలా. మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు అవును కనీసం ఇంకా ఒక్కసారైనా పెళ్లి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా..? అంటూ కామెంట్ చేసింది.

 

అంతేకాదు `నేను ఐదో పెళ్లి చేసుకున్నట్టుగా అంతా భావిస్తారు కానీ నేను చేసుకుంది కేవలం మూడు పెళ్లిళ్లే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 1995లో టామీ లీని వివాహం చేసుకుంది పమేలా. 98లో అతని నుంచి విడిపోయింది. తరువాత 2006లో కిడ్‌ రాక్‌ను వివాహం చేసుకుంది. ఏడాదిలోనే ఈ బంధం కూడా తెగిపోయింది. అదే ఏడాది రిక్‌ సాలోమన్‌ను పెళ్లి చేసుకొని వెంటనే కటీఫ్ చెప్పేసింది. తరువాత మరోసారి రిక్‌ నే 2014లో వివాహం చేసుకుంది. కానీ మరోసారి అతడితో కుదరక 2015లో విడిపోయింది.

 

ఇటీవల జాన్‌ పీటర్స్‌ ను పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలు వినిపించినా తాను వివాహం చేసుకోలేదని కేవలం కొంత కాలం సహజీవనం మాత్రమే చేశామని ఈ జంట క్లారిటీ ఇస్తుంది. దీంతో మొత్తంగా ఐదు సార్లు రిలేషన్‌ షిప్‌ కు బ్రేక్‌ అప్‌ చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో సారి పెళ్లికి రెడీ అవుతోంది. అయితే నాలుగో భర్తతో ఐదో పెళ్లి చేసుకోవాలనుకుంటుందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: