సినీ సంగీతం లో అడుగు మోపి తనదైన మార్క్ చాటుకున్న ఇళయరాజా ని ఇన్స్పిరేషనల్ గా తీసుకొని ఎంతోమంది సంగీతం నేర్చుకోవడానికి ముందడుగులు వేశారు. తనకే ఏకలవ్య శిష్యుడు అని చెప్పుకోవడానికి ఎంతో మంది సంగీత కళాకారులు గొప్పగా చెప్పుకుంటారు. నిజానికి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎ.ఆర్.రెహమాన్ కూడా ఇళయరాజాకు శిష్యుడేనట. కర్నాటిక్ సంగీతంలో నైపుణ్యం సాధించిన దక్షిణామూర్తి వద్ద సంగీతం నేర్చుకున్న ఇళయరాజా తన జీవితంలో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. 

IHG
తన గురువు దక్షిణామూర్తి కూడా 125 సినిమాలకి పైగా పాటలను రూపొందించారు. తాను తన జీవితంలో సినిమా పాటలతో పాటు ప్రైవేటు పాటలను కూడా రూపుదిద్ది భారత దేశ ప్రజలకు తన అసలు సిసలైన సంగీతాన్ని రుచి చూపించారు. అయితే దక్షిణామూర్తి దగ్గర పి సుశీల, కావియార్ రేవమ్మా లాంటి ఉత్తమ గాయనీ గాయకులు సంగీతం నేర్చుకున్నారు. సంగీత దర్శకులైన ఏ.ఆర్.రెహమాన్, గాయకుడు కె.జె ఏసుదాస్ కూడా దక్షిణామూర్తి కి శిష్యులుగా ఉంటూ సంగీతం లో నైపుణ్యం సాధించారు. 

 

అప్పట్లో దక్షిణామూర్తికి సహాయకుడిగా ఉన్న ఇళయరాజా వద్ద ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునే వారు. ఆ విధంగా ఏ.ఆర్.రెహమాన్ ఇళయరాజాకు శిష్యుడయ్యాడు. గురువు దక్షిణామూర్తి, శిష్యుడు ఇళయరాజా, శిష్యుడు యొక్క శిష్యుడు ఏ.ఆర్.రెహమాన్ అందరూ కలిసి తన జీవితంలో ఎన్నో వేల పాటలను భారతీయ శ్రోతలకు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇళయరాజా ఏ.ఆర్.రెహమాన్ లలో ఎవరు గొప్ప సంగీత దర్శకుడు అని అడిగితే ఇళయరాజా ఎవరైనా చెప్పగలరు. ఇళయరాజా కచేరీలు ఏ.ఆర్.రెహమాన్ కచేరీలు చూసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: