మన దేశంలో... దేశానికే గర్వకారణం గా నిలిచిన సంగీత దర్శకుల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సంగీత దర్శకుడు ఇళయరాజా ఆయన సంగీతం కోసం చాలా మంది చెవులు కోసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆయన సంగీతం వినడానికి ఎందరో ఆసక్తి చూపించే వారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆయన సంగీతం ఉండేది అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ దేశం వారు అయినా సరే ఆయన సంగీతానికి ఫిదా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. 

 

ఇక ఆయన సంగీతం అంటే తమిళనాడు మాజీ సిఎం కరుణా నిధికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఆయన సంగీతం వినడానికి గానూ  ఆ మాజీ సిఎం ప్రత్యేకంగా సీడీలను తెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. అంతే కాదు ఆయనను స్వయంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి తిరిగి కారులో తీసుకుని వెళ్ళిన సందర్భం కూడా ఉంది అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఇళయరాజా సంగీతాన్ని అందరూ ప్రేమించారు. ఇక మాజీ సిఎం జయలలిత కూడా ఖాళీ గా ఉన్న సమయంలో ఆ సంగీతం ఎక్కువగా వినే సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు. 

 

ఇక ఆయన సంగీతం కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధి కూడా తమిళనాడు వచ్చిన సమయంలో తనకు బాగా సన్నిహితంగా ఉండే మహిళా నేత ద్వారా పాటలను తెప్పించుకుని విన్నారు అని ఆయన సంగీతం ఉన్న సినిమాలను కచ్చితంగా చూసే వారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఇళయరాజా సంగీతాన్ని అందరూ కూడా ఆదరించారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ తరం అయినా సరే ఆయన సంగీతానికి ఫిదా అవ్వాల్సిందే అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: