చాలామంది సంగీత దర్శకులు పాటలకు తగినట్టుగా సంగీతం అందిస్తారు కానీ 100% ఆ పాటకు తగినట్లుగా వారు సంగీతాన్ని అందిస్తారు అని అనుకోవడం పొరపాటే. సిట్యుయేషన్ కి తగ్గట్టుగా కూడా పాటలకు సంగీతం కొట్టడం క్లిష్టతరమైనది. కానీ ప్రముఖ సంగీత దర్శకుడు పాటకు తగినట్లుగా సంగీత ప్రాణాలను అందించడమే కాకుండా సిచువేషన్ కి (సూట్ అయ్యేవిధంగా) అనుగుణంగా సంగీతాన్ని అందిస్తాడు. ఈ అరుదైన ప్రతిభ తనను భారతదేశంలో ఒక గొప్ప సంగీత దర్శకుడిగా తీర్చిదిద్దింది. ఇళయరాజా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అందించడంలో దిట్ట. 


తన సినీ కెరీర్ లో పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన ఇళయరాజా 1970లో ఒక విధంగా, 80ల్లో మరోలా, 90ల్లో పూర్తి భిన్నమైన పాటలను రూపొందించి సంగీత సరస్వతి పుత్రుడు గా పాపులారిటీ పొందాడు. తన పాటలను తానే స్వయంగా ఆర్కెస్ట్రా నిర్వహించి పాటలకు ప్రాణం పోస్తాడు. వాస్తవానికి ఇళయరాజా అనేక మంది గురువుల వద్ద అనేకమైన సంగీత రంగాలలో నైపుణ్యం సాధించాడు. దీన్నిబట్టి తాను గొప్ప సంగీత దర్శకుడు కావడానికి తన పట్టుదల కృషి కారణమని చెప్పవచ్చు. 


ఇళయరాజా తన సినిమా కెరీర్ పీక్ స్టేజ్ లో కూడా ఉదయం నాలుగు గంటలకు నిద్ర చేసి సంగీతముని ప్రాక్టీస్ చేసేవారు. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్ళకుండా ఎంతో క్రమశిక్షణతో కమిట్మెంట్ తో తన జీవితం మొత్తం సంగీతానికి అర్పించి గొప్ప కళాకారుడిగా పేరు పొందాడు. బాధలో ఉండి మానసికంగా కృంగిపోతున్న వారు ఇళయరాజా పాటలను ఒక గంట పాటు వింటే వారి బాధ పూర్తిగా తగ్గిపోతుంది. ఎటువంటి మానసిక రోగాన్ని అయినా సంగీత నయం చేయగలదు అంటారు. ఒకసారి ఇళయరాజా పాటలు వింటే ఇది నిజమని స్పష్టమవుతుంది. ఇళయరాజా రూపొందించిన కొన్ని పాటలు మనసును నేరుగా తాకుతాయి. ఒక్కసారి తన పాటలు కన్నీళ్లు కూడా తెప్పించ గలవు. అతడిని ఇప్పటికీ సంగీతం దేవుడిగా పూజించే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: