తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకులలో ముందు వరుసలో ఉంటారు ఇళయరాజా. తనదైన సంగీతంతో ఎన్నో అద్భుతాలను సృష్టించారు అని చెప్పవచ్చు. మాస్ ఒరవడిలో కొట్టుకుపోతున్న సంగీతాన్ని ఒక గాడిలోకి తీసుకొచ్చి సంగీత ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఇళయరాజా. ఇళయరాజా సంగీతం వింటుంటే ఏదో తెలియని హాయి... మనసంతా పులకరించిపోతుంది.. ఏ పాట విన్న మరోసారి వినాలనిపిస్తుంది... సాఫీగా సాగిపోయే సంగీతంతో... ఎంతో  అర్థం వచ్చే లిరిక్స్ తో... అద్భుతమైన సరికొత్త వాయిద్యాలకు.. తనదైన సంగీతానికి జోడించి తెలుగు ప్రేక్షకులను ఎన్నోసార్లు ఆశ్చర్యపరిచారు ఇళయరాజా. సంగీతం లో ఇళయరాజా చూపించిన ప్రతిభ నేటి తరం దర్శకులకు ఆదర్శప్రాయంగా నిలిచింది. 

 


 ఇక 1980 దశకంలో ఇళయరాజా సంగీతం అంటే సంగీత ప్రేమికులు అందరూ చెవి  కోసుకునే వారేమో అనేంతలా  సంగీత ప్రేమికులను ప్రభావితం చేసింది ఇళయరాజా సంగీతం. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన అన్ని సినిమాలలో మ్యూజిక్ హిట్ అవ్వడానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతమే కారణం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏ.ఆర్.రెహమాన్ ఇండస్ట్రీకి పరిచయం కాకముందు గొప్ప దర్శకుడైన మణిరత్నం సినిమాల్లో కూడా  ఇళయరాజా తన సంగీతంతో అలరించారు. అయితే ఇళయరాజా ఏ పాటను సమకూర్చిన అది ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధించింది. ఇళయరాజా సంగీతం తో ఒక గొప్ప మ్యాజిక్ క్రియేట్ చేశారు. 

 


 ఇలా ఇళయరాజా సమకూర్చిన పాటలు ఎన్నో మైలురాళ్లు గా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి పాటలలో ఒకటి ఘర్షణ సినిమా లోని నిన్ను కోరే వర్ణం. ఒక యువతి తన ప్రియుడి కోసం పడే తపన గురించి పాటలో వివరిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇళయరాజా పాటలో  స్పష్టంగా చెప్పుకొచ్చారు. నిన్ను కోరే వర్ణం వర్ణం అంటూ సాగిపోయే ఈ పాట... ఇప్పటికీ సంగీత ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటుంది. ఇలాంటి పాటలు వింటే ఎందుకో  సంగీత ప్రేక్షకులు మైమరచిపోతూ ఉంటారు. అద్భుతమైన లిరిక్స్ కి అమోఘమైన సంగీతాన్ని  జోడించి... ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట ఎంతోమందిని అలరించి ఎంతో గొప్ప పాటగా పేరు సంపాదించింది. ఇప్పటికి ఈ పాట వింటుంటే సంగీత ప్రేక్షకులందరికీ ఏదో తెలియని పులకరింపు వస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: