తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి.. సంగీత ప్రేమికులను మైమరిపింప చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఒక సాదాసీదా సంగీతదర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఇళయరాజా... ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1970 దశకంలో మాస్ మసాలా మ్యూజిక్ తో కొట్టుకుపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో... ఒక అపురూప సంగీతానికి ఆధ్యం  పోశారు ఇళయరాజా. అద్భుతమైన సంగీతాన్ని అందించి మరోసారి సంగీత ప్రేక్షకులను ఆకర్షించాడు. పాటలోని అర్థం అందరికీ అర్థమయ్యే విధంగా... చక్కనైన బాణీలు జోడించడం... మధురమైన సంగీతంతో సంగీత ప్రేమికులు అందరిని మైమరిపింప చేశారు ఇళయరాజా. ఇళయరాజా సంగీత తరంగం సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇళయరాజా అందించిన సంగీత కళా మాలికలో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఆయన సంగీతంతో చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా . ఎలాంటి పాత్రలోనైనా తనదైన ప్రతిభ నైపుణ్యం చూపించి సంగీత ప్రేక్షకులను మెప్పించగల సత్తా  ఇళయరాజా  సొంతం. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు అంటే సంగీత ప్రేక్షకులందరికి మనసు పులకరించిపోతుంది ఆ పాట వింటుంటే. ఎన్నిసార్లు విన్న ఆ పాట వినసొంపుగానే ఉంటుంది. సన్నివేశానికి తగ్గట్లుగా బాణీలను జోడించి.. ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఇళయరాజా. ఆయన సంగీత ప్రస్థానంలో ఎన్నో నేషనల్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. సాగర సంగమం అనే సినిమా ద్వారా సరికొత్త సంగీతాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఇళయరాజా రుద్రవీణ అనే సినిమా ద్వారా ఏకంగా నాలుగు నేషనల్ అవార్డును సైతం గెలుచుకున్నారు. 

 


 అయితే చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించి సరికొత్తగా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి సినిమాలో ఇళయరాజా అందించిన ఎన్నో పాటలు మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఇలా కొండవీటి దొంగ అనే సినిమాలో కూడా... శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో... అనే పాటను అందించారు ఇళయరాజా . ఈ పాట నేటి తరం ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. ఈ పాట వింతున్నంత సేపు సంగీత ప్రేక్షకులందరూ మైమరచిపోతూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: