తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది మధ్య మంచి సాన్నిహిత్యం సంబంధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలాగే టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీ మధ్య మంచి సాన్నిహిత్యం సంబంధం ఉంటుంది అన్నది తెలుగు ప్రేక్షకులకు విధితమే. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఎప్పుడు ఫేవరెట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం కూడా ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన కమెడియన్ ఆలీ తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం గురించి... పరిచయం ఎలా ఏర్పడింది అనేదాని గురించి చెప్పుకొచ్చారు. చిరంజీవి కుటుంబానికి తాను  అంటే ఎంతో ఇష్టమని.. వారి కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగిన తనకు.. బ్రహ్మానందం కి తప్పక పిలుపు అందుతుంది అంటూ చెప్పుకొచ్చారు. 

 

 ఇక అన్నయ్య చిరంజీవి కోసం ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్  అక్కడే ఉండేవారని... అప్పటికి ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్ళము అలా పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు కమెడియన్ అలీ. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ తన సినీ కెరీర్ లో మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి,  అజ్ఞాతవాసి సినిమాలు మినహా మిగతా అన్ని సినిమాలలో తాను పవన్ కళ్యాణ్ తో నటించాను  అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినీ రంగంలో తమ జర్నీ ఎంతో అద్భుతంగా సాగింది అంటు కమిడియన్ అలీ  తెలిపారు.

 

కాలక్రమేణా మా ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది అంటు చెప్పుకొచ్చారు. 
 పవన్ కళ్యాణ్ మిమ్మల్ని చూడగానే ఎందుకు పగలబడి నవ్వుతూ ఉంటారు అని ప్రశ్నించగా.. మా ఇద్దరికీ అర్థం అయ్యే విధంగా మా ఇద్దరి మధ్య కొన్ని సైగలు  ఉన్నాయని అందుకే నన్ను చూడగానే ఆయన పగలబడి నవ్వుతూ ఉంటారు అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు కమెడియన్ అలీ . పవన్ కళ్యాణ్ ప్రతి యేటా తనకు ఆర్గానిక్ మామిడి పండ్లను పంపిస్తూ ఉంటారని కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు మామిడి పండ్లు మాత్రం అందలేదు అంటూ చెప్పుకొచ్చారు. బహుశా  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగానే తనకు మామిడి పండ్లు పంపించి  ఉండకపోవచ్చు అంటూ తెలిపారు అలీ .

మరింత సమాచారం తెలుసుకోండి: