ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఆలీ ఎంత సన్నిహితంగా స్నేహంగా ఉంటారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాలలో ఆలీ నటించడం జరిగింది. ఒకవేళ సినిమాల్లో ఆలీకీ  క్యారెక్టర్ లేకపోయినా కాని పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి డైరెక్టర్ తో మాట్లాడి ఆలీ తన సినిమాలో ఉండేటట్టు చూసుకొంటాడు. ఆలీ అంటే పవన్ కళ్యాణ్ కి అంత ఇష్టం అభిమానులకు కూడా చాలా గౌరవం, అభిమానం కూడా. వెండితెరపై గానీ అదే విధంగా సినిమా ఆడియో ఫంక్షన్ లో గాని ఇద్దరు నిలబడితే ఆ వాతావరణమే వేరు. అటువంటిది 2019 ఎన్నికల టైంలో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ తరపున ఆలీ ప్రచారం చేయడం జరిగింది.

IHG

ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆలీ సొంత ఊరు రాజమండ్రిలో ఆలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఆలీ ఒక్క సారిగా షాక్ తిని కౌంటర్లు కూడా ఆలోచించకుండా వేశారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ఎప్పుడూ కూడా మాట్లాడుకున్న దాఖలాలు కనబడలేదు. అదేవిధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన 'వకీల్ సాబ్'‌ సినిమాలో కూడా ఆలికి అవకాశం దొరకలేదు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ అలాగే ఉందని అర్థమైంది. ఇదిలా ఉండగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ పవన్ కళ్యాణ్ గురించి సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

IHG

పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాల్లో ఛాన్స్ దొరికింది కానీ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాల్లో ఛాన్స్ రాలేదని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది పవన్ తన ఫార్మ్‌ హౌస్‌లో పండించే మామిడి పండ్లను పంపేవాడు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి పంపటం లేదని తెలిపారు. గత ఏడాది రాజకీయాల్లో బిజీగా ఉంటే ఈ ఏడాది లాక్ డౌన్ వల్ల పంపించ లేదేమో, వచ్చే ఏడాది పంపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. అంతేకాదు ఈ సమ్మర్ లో పవన్ మామిడి కాయలు మిస్ అవుతున్నాను అంటూ ఆలీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: