ఆర్ఆర్ఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సినిమా గురించి జరుగుతున్న చర్చలు అన్నీ ఇన్ని కావు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులతో పాటుగా టాలీవుడ్ లో ప్రముఖులు కూడా అందరూ ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. సినిమా కథ ఏ విధంగా ఉంటుంది సినిమా ఎలా తీస్తున్నారు ఇలాంటి అనేక విషయాల గురించి ఇప్పుడు టాలీవుడ్ లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది రావడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా కోసం హీరోలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

 

ముఖ్యంగా రామ్ చరణ్ అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇక నుంచి రాత్రి పూట షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. షూటింగ్ ని రాత్రి సమయంలో నదిలో చేస్తారని కొంత భాగం బురద లో ఉండే అవకాశం ఉందని అందులో పోలీస్ క్యాప్ పడకుండా అతను నటించాలి అని డూప్ లేకుండా నటించే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దీని కోసం రామ్ చరణ్ ఇప్పుడు చాలా వరకు కష్టపడుతున్నాని అంటున్నారు. మరి ఆ సన్నివేశాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. 

 

సినిమా తర్వాత రామ్ చరణ్ దాదాపు రెండు సినిమాల్లో నటించే అవకాశం ఉందని సమాచారం. కథ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఇప్పటి వరకు ఏ అవగాహన కూడా రాలేదు. ముఖ్యంగా హీరోల పాత్ర విషయంలో మాత్రం కాస్త అవగాహన వచ్చినా సినిమాలో ఆ ఇద్దరు ఏ విధంగా ఉంటారు అనే దాని మీద ఇప్పుడు చర్చలు చాలా వరకు జరుగుతున్నాయి. ఏది ఎలా ఉన్నా గాని ఇప్పుడు మాత్రం ఈ సినిమా సంచలనం.

మరింత సమాచారం తెలుసుకోండి: