తెలుగులో ఇప్పుడు దాదాపుగా అందరు అగ్ర హీరోల సినిమాలే లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న హీరోల సినిమాలు లైన్ లో ఉన్నా సరే ఏ సినిమా ముందు విడుదల అవుతుంది అనేది స్పష్టత రావడం లేదు. చిన్న చిన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఓటీటీ మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. కాని అది నిజం కాదని సమాచార౦. అగ్ర హీరోల సినిమాలు అంటే హాల్ లోనే విడుదల కావాల్సి ఉంటుంది. 

 

ఈ విధంగా ఓటీటీ లో విడుదల చేస్తే నిర్మాతలు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఒకటికి పది సార్లు ఆలోచన చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ప్రస్తుతం చిరంజేవి తన సినిమాను అందరి కంటే ముందు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజమా కాదా అనేది పక్కన పెడితే త్వరలోనే దీని పై ఒక వార్త అయితే వచ్చే సూచనలు ఉన్నాయి. చిరంజీవి ఇప్పటికే సినిమా షూటింగ్ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. 

 

ఈ నెల మూడో వారం నుంచి ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజమా కాదా అనేది చూడాల్సి ఉంది. ఇక చిరంజీవి ని చూసిన ఇతర హీరోలు కూడా అదే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. త్వరలోనే కొన్ని కొన్ని సినిమాల దర్శకులు నిర్మాతలు హీరోలు అందరూ కూడా సమావేశం అయి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: