టాలీవుడ్ లో నాగబాబు బాలకృష్ణ వివాదం ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనపడట౦ లేదు. తాజాగా బాలకృష్ణ ఒక ఇంటర్వ్యు లో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. నాగ బాబు గురించి ఏదో ప్రశ్న అడగగా ఆయన నుంచి అసహనంగా సమాధానం వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ పై ఇప్పుడు మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలకృష్ణ అహం చూపించారు అని సమాధానం అడిగితే ఒక రకంగా స్పందించారు అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

ఇక మెగా అభిమానులు అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయంగా అకుడా ఇది దుమారం రేపే అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు ఏ మాత్రం కూడా జీర్ణించుకునే పరిస్థితిలో లేరు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ అనవసరంగా చేస్తున్నారు అంటూ పలువురు కామెంట్ లు కూడా చేస్తున్నారు. ఈ సినిమా అనవసరంగా  రామ్ చరణ్ అంగీకరించాడు అని  నందమూరి వాళ్లకు మెగా హీరోలు అంటే చిన్న చూపు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇక నాగ బాబు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీనిపై మాత్రం స్పష్టత త్వరలోనే వస్తుంది అని అంటున్నారు. ఇక బాలకృష్ణ విషయంలో చిరంజీవి కూడా ఇప్పుడు ఆగ్రహంగానే ఉన్నారు అనేది కొందరి మాట. మరి ఎం జరుగుతుంది భవిష్యత్తులో అనేది చూడాలి. ప్రస్తుతం దీనికి ఎండ్ కార్డ్ అయితే పడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: