ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు తన కొత్త సినిమాకు సంబంధించి ట్రైలర్ గాని ఏదో ఒక విషయాన్ని ప్రకటిస్తాడు మహేష్. అయితే ఈ ఏడాది తన కొత్త సినిమా టైటిల్ యొక్క వివరాలు అనౌన్స్ చేశారు. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ పేరిట పోస్టర్ ని రిలీజ్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో లుక్స్ పరంగా మేకోవర్ విషయంలో మిగతా హీరో లాగా రాకుండా మార్పు చూపించని  హీరో మహేష్ బాబు. మిగతా హీరో లగా హెయిర్ స్టైల్ మార్చడం గడ్డం పెంచడం ఫేస్ కట్ లో మార్పు చూపించడం డ్రెస్సింగ్ విషయంలో కొత్తగా ట్రై చేయడం మహేష్ విషయంలో తక్కువే. అందులోనూ గత కొన్నాళ్ల నుండి మహేష్ బాబు సేమ్ లుక్ లోనే సినిమాలు వస్తున్నాయి. 'శ్రీమంతుడు' దగ్గర నుంచి 'సరిలేరు నీకెవ్వరు' వరకు దాదాపు ఒకే లుక్ లో మహేష్ కనిపించాడు. దీంతో మహేష్ అభిమానులు నుండి డిఫరెంట్ లుక్ లో కనబడాలని ఒత్తిడులు గత కొంత కాలం నుండి వినబడుతున్నాయి.

IHG

దీంతో అభిమానుల కోరిక 'సర్కారు వారి పాట' లో తీర్చడానికి మహేష్ రెడీ అయినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు లుక్ గమనిస్తే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. తాజాగా విడుదలైన ఈ ప్రీ లుక్ లో జుట్టు పెంచి, చెవికి పోగు తగిలించి కొంచెం గడ్డం కూడా పెంచి రఫ్ లుక్ లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. లుక్స్ పరంగా ‘సర్కారు వారి పాట’ మహేష్ కి సరికొత్త మేక్ఓవర్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉండగా మహేష్ మెడపై రూపాయి బిల్ల టాటూ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

IHG's entry to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='cinema-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cinema</a> ...

ఇండస్ట్రీ నుండి వినబడుతున్న సమాచారం ప్రకారం మొదట మహేష్ మెడపై డాలర్ టాటూ వెయ్యాలని అనుకున్నారట. అమెరికాలో సినిమా షూటింగ్ ఉంటుందని భావించినా తర్వాత లాక్ డౌన్ కరోనా ఎఫెక్ట్ తో  విదేశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇండియా లోనే సినిమా షూటింగ్  ఉండటంతో మహేష్ మెడపై వన్ రూపీ టాటో వేయటం జరిగిందట. సినిమా స్టోరీ పరంగా ప్రభుత్వంలో మొత్తం జరిగే కొన్ని లూప్ హొల్స్ గురించి, మనీ లాండరింగ్ లాంటి విషయాలను గట్టిగానే  ప్రశ్నించే లాగా మహేష్ క్యారెక్టర్ భారీ ట్విస్ట్ ఇచ్చే విధంగా ఉండబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: