రీఎంట్రీ అనగానే ఆటోమెటిక్ గా భారీ హైప్స్ ఉంటాయి. ఈ ఇన్నింగ్స్ లో తమ హీరో ఎలాంటి మేజిక్కులు చేస్తాడో అని అభిమానులు బోల్డన్ని అంచనాలు పెట్టుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ అంటే ఫ్యాన్స్ లో బజ్ మామూలుగా ఉండదు. ఈ అంచనాలను అందుకోవడానికి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. 

 

పవన్ కళ్యాణ్ రిస్క్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సేఫ్ గేమ్ కే ప్రియారిటీ ఇస్తున్నాడు. కొత్త కథలతో ప్రయోగం చేయడం ఎందుకు అనుకుంటున్నాడో.. లేక ప్రూవ్డ్ సబ్జెక్ట్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నాడో గానీ.. ఎక్కువగా రీమేకులకే సైన్ చేస్తున్నాడు పవన్. 

 

పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. రెండేళ్ల క్రితం ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వెళ్లిన పవన్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలు చేయలేదు. ప్రజాక్షేత్రంలోనే బిజీగా గడిపాడు. అయితే ఇప్పుడు అభిమానులను అలరించేందుకు వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 

 

హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ గా తెరకెక్కుతోంది వకీల్ సాబ్. హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రను పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తమిళ్ లో నేర్కొండ పార్వాయ్ గా రీమేక్ అయింది. అజిత్ లాయర్ పాత్ర పోషించిన ఈ సినిమాకు తమిళ్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కూడా సేమ్ రిజల్ట్ అందుకోవడానికి వకీల్ సాబ్ గా మారాడు. 

 

రీమేక్ మూవీతోనే రీఎంట్రీ ఇస్తోన్న పవన్ కళ్యాణ్ మళ్లీ ఓ రీమేక్ స్టోరీలో నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అన్నయ్య కోసం అబ్బాయి తీసుకున్న కథలో తమ్ముడు నటిస్తాడనే టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఓ మళయాళీ పొలిటికల్ థ్రిల్లర్ ను తెలుగు రాజకీయాలకు తగ్గట్టుగా మార్చేస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. 

 

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ తర్వాత హరీశ్ శంకర్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటందని చెబుతున్నారు. 

 

పవన్ కళ్యాన్ ఓ మళయాళి రీమేక్ లో నటించే అవకాశముందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మోహన్ లాల్ టైటిల్ రోల్ ప్లే చేసిన లూసిఫర్ కథలో నటించబోతున్నాడట పవన్. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టింది. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు లూసిఫర్. 

 

లూసిఫర్ కథను మొదట చిరంజీవి రీమేక్ చేస్తాడనే టాక్ వచ్చింది. సైరా టైమ్ లోనే రామ్ చరణ్ ఈ కథను తీసుకున్నాడనీ.. దర్శకుడి కోసం వెతుకుతున్నాడనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఈ కథను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడట చిరు. మరి అన్నయ్య త్యాగం చేస్తోన్న ఈ కథను తమ్ముడు ఏ దర్శకుడికి అప్పగిస్తాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: