అసలు పెద్ద ఎవరు అన్న ప్రశ్న ముందు వస్తుంది. పెద్ద వారు అంటే వయసులోనా, హోదాలోనా, లేక వారి స్టారిజంలోనా. ఆ మాటకు వస్తే దాసరికి స్టార్ హీరోల కంటే గ్లామర్ చాలా ఎక్కువ అంటారు. ఇక ఆయన తనకంటే వయసు ఎక్కువగా ఉన్న హీరోల నుంచి కూడా మన్ననలు అందుకున్నారు. దాసరి అంటే ఇండస్ట్రీకి భయం, భక్తితో పాటు అంతకంటే చనువు అభిమానం ఉండేవి, ఇవి కదా ఆయన తరువాత‌ సినీ పెద్ద కావాలి అనుకుంటున్న వారు అలవరచుకోదగిన లక్షణాలు.

 

కానీ ఇపుడు ఏం జరుగుతోంది. కొందరికి పెద్ద అయిన వారు మరి కొందరికి చెడ్డ అవుతున్నారు. ఎందుకిలా అంటే  అదంతే అంటారు కొంతమంది. నిజానికి సినిమా పరిశ్రమ ఎపుడు వివాదాల్లో లేదు.కష్టం వస్తే అంతా ఒక్కటిగా నిలిచారు. దాసరి టైంలో కూడా ఎవరి స్వార్ధాలు, పర్సనల్ ఇగోలు ఉండేవి. కాని ఒక్క మాట చెబితే వినేవారు. అదీ నాటి క్రమశిక్షణ. ఇపుడు మాత్రం వీరే మన పెద్ద అని ఒకరు చెబుతూంటే అంగీకరించే పరిస్థితి లేదు అంటున్నారు.

 

డైరెక్టర్ తేజా దీని మీద మాట్లాడుతూ ఎవరో పెద్ద అని చెప్పడం కాదు, సినీ పరిశ్రమ మొత్తం ఈయనే మనకు పెద్ద అనిపించేలా ఉండాలి అంటున్నారు. అలాంటి వారు వస్తేనే ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పగలం అంటున్నారు. ఇక దాసరిని చూస్తే కాళ్ళు మొక్కాలనిపించేది అని కూడా అంటున్నారు. ఆయన బాలక్రిష్ణ విషయంలోనూ స్పందించారు. బాలయ్యను ఎందుకు పిలవరు అని కూడా గట్టిగానే అడిగారు.

 

 

బాలయ్యతో పాటు చిరంజీవిని కూడా పిలవాలని అపుడే సమతూకం అవుతుందని అంటున్నారు. నిజానికి కొందరు సినీ పెద్దలుగా చెప్పుకుంటున్న వారు సినిమాలు తీసినవి కూడా అపుడెపుడో ఒకటో రెండో ఉంటాయి. వారు ఇపుడు ఏమీ చేయకుండానే పెద్దలుగా చలామణీ అవుతున్నారు. పైగా బాలయ్య లాంటి వారు ఇప్పటికీ సినిమాలు చేస్తూంటే రన్నింగులో షూటింగు ఉన్న వారికే చర్చలకు పిలిచామని అంటున్నారు.

 

 

ఈ చమత్కారాలు, వెటకారాలే ఎక్కువైపోయి ఇండస్ట్రీ  ఇలా అయిందని టాలీవుడ్లో అంటున్నారు. మొత్తానికి తేజా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టి దాసరి కేసరి అని, ఆయన లాంటి వారు మళ్ళీ పుట్టరని కూడా అనేశారు. అంటే తెలుగు సినీ పెద్ద ఎవరు అన్నది ఇంకా ప్రశ్నగానే ఉందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: