యంగ్ హీరోలు అనగానే లవ్ స్టోరీసే గుర్తుకొస్తాయి. లవ్వుపువ్వు అంటూ వెంటపడే అల్లరి అబ్బాయిల పాత్రలే జనాల్లో ఓ జనరలైజ్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఇప్పుడా ఆలోచనను మార్చేస్తున్నారు కొంతమంది కుర్రాళ్లు. 

 

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎక్కువగా హిట్స్ కొడుతోన్న హీరో నాని. కొంచెం లవ్, మరికొంచెం ఎమోషన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తోన్న ఈ హీరో ఇప్పుడీ ట్రాక్ నుంచి మరో ట్రాక్ లోకి వెళ్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నెగిటివ్ షేడ్ చూపించేందుకు రెడీ అయ్యాడు. వి సినిమాలో విలన్ వేషాలు వేస్తున్నాడు నాని. 

 

మాస్ స్టోరీస్ తో మెగా ఫ్యాన్స్ కు దగ్గరైన హీరో సాయి తేజ్. పాటలు, ఫైట్ లు ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేసే తేజ్ ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాడు. రెగ్యులర్ హీరోయిజానికి దూరంగా చిత్రలహరి చేసిన తేజ్, తర్వాత ప్రతీరోజు పండగే చేశాడు. ఇప్పుడు దేవకట్టా దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నాడు. 

 

యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఈ మధ్యనే  ఈ లవ్ ట్రాకుకు బ్రేకులేశాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ప్రేమ కథలకు కామా పెట్టిన విజయ్.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ రింగ్ లోకి దిగాడు. బాక్సింగ్ ఛాంపియన్ గా పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. 

 

రెగ్యులర్ స్టోరీస్ అంటే జనాలే కాదు... హీరోలు కూడా దూరంగా జరుగుతున్నారు. సమ్ థింగ్ స్పెషల్ గా అనిపించే స్టోరీస్ కే సైన్ చేస్తున్నారు. కొత్త కథలతో ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఆలోచనలతోనే కొంతమంది రైతుల్లా నాగలిపడుతోంటే మరికొంతమంది గజినీల్లా మారుతున్నారు. 

 

ఎలాంటి పాత్రైనా సూపర్ అనిపించే హీరో శర్వానంద్. లవర్ బాయ్ క్యారెక్టర్స్ అయినా.. హెవీ ఎమోషనల్ క్యారెక్టర్స్ అయినా సమన్యాయం చేసే శర్వానంద్ ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు. నాగలిపట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకోవడానికి శ్రీకారం చుట్టాడు. ఈ మూవీతో కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: