ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సినిమాల షూటింగ్ కి సంబంధించి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే దాని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ఏపీ లో సినిమాల షూటింగ్ ల విషయంలో ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది అనేది మాత్రం చెప్పడం లేదు. ఈ నెల నుంచి సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చారని జరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా సర్కార్ వద్దని చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు సినిమాల షూటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో సినిమాల షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సిఎం వైఎస్ జగన్ తో ఆయన మాట్లాడి ఒప్పించాలి అని భావిస్తున్నారు. ఎవరి సహకారం వచ్చినా లేకపోయినా సరే తాను మాత్రం సినిమాల షూటింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్న చిరంజీవి ఇప్పుడు తన వంతుగా ప్రయత్నాలను  ముమ్మరం చేస్తున్నారు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. 

 

ఇప్పుడు ఆయన ఏపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని జగన్ ని కలిసే అవకాశాలు ఉన్నాయని గోదావరి జిల్లాల్లో షూటింగ్ కి అనుమతులు ఇవ్వాలి అని ఆయన అడిగారు అని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీనిపై త్వరలోనే ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇప్పటికే సినిమాల విడుదల గాని సినిమాల షూటింగ్ గాని లేక సినీ పరిశ్రమ నానా ఇబ్బందు లు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: