చిన్న చిన్న సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు నిర్మాతలు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. సినిమా మీద మంచి లాభం వస్తుంది అనుకుంటే చాలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తు ఉంటారు. దాదాపు అందరూ కూడా ఇదే ఆలోచనలో ఉంటారు అనేది వాస్తవం. మంచి లాభం వస్తే మాత్రం అగ్ర నిర్మాతలు చిన్న చిన్న సినిమాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకు కష్టాల్లో ఉన్న అందరూ కూడా తమ వంతుగా చిన్న సినిమాలకు తమ సహకారం అందించాలి అని భావిస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే అగ్ర నిర్మాతలు మంచి సినిమా అయితే చిన్న సినిమాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. అగ్ర నిర్మాతలు అందరూ కూడా చిన్న చిన్న సినిమాలను కొని వాటిని విడుదల చేస్తే మంచి లాభాలు తెచ్చుకోవచ్చు అని భావిస్తున్నారని సమాచారం. దీని నుంచి అగ్ర హీరోల సహకారం కూడా అడిగారు అని ప్రచారం చెయ్యాలి అని వారిని కోరారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రభాస్ మహేష్ బాబు సహా పలువురు హీరోలను కలిసి దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. 

 

మరి అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా లేక లేదా అనేది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న హీరోల సినిమాలకు మంచి డిమాండ్ వచ్చింది. అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. అల్లు అరవింద్ దిల్ రాజు ఇప్పటికే కథలను కొన్నారని అంటున్నారు. అగ్ర హీరోలతో సినిమాలు చేసి అవి హిట్ అవుతాయో ఫ్లాప్ అవుతాయో తెలియకుండా అనవసరంగా తొందరపడి బాధ పడటం ఎందుకు అని చిన్న సినిమాలను కొనుక్కుంటే వచ్చే నష్టం చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారట చూడాలి మరి ఏ సినిమాలను వాళ్ళు కొనుగోలు చేస్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: