మన తెలుగులో ఇప్పుడు ప్రాంతాలను బట్టీ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాస లో నటించే అవకాశం ఉంది అనే సంగతి తెలిసిందే. ఆయన చిత్తూరు యాస కోసం ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కథ లో పూర్తిగా చిత్తూరు యువకుడి గానే అతను కనపడతాడు. అందుకే ఇప్పుడు అతనికి మార్పులు చేయడానికి కూడా ఏ మాత్రం సుకుమార్ ఆసక్తి చూపించడం లేదు అని సమాచారం. సినిమాను వచ్చే ఏడాది తీసుకొచ్చే ఆలోచనలో ఉన్న సుకుమార్... 

 

ఈ సినిమాలో బన్నీ పాత్ర కోసం చాలా కష్టాలు పడుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో తన పాత్రకు ఉండే యాస కోసం బన్నీ ఇప్పుడు చిత్తూరు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అక్కడికి వెళ్లి అతను బాష నేర్చుకునే అవకాశం ఉందని కొన్ని కొన్ని సన్నివేశాలకు ఆ యాస అనేది చాలా కీలకం అని అంటున్నారు. అందుకే ఇప్పుడు బన్నీ కష్టపడుతున్నాడు అని సమాచారం. అదే విధంగా హీరోయిన్ పాత్ర కు కూడా చిత్తూరు యాస ఉండే అవకాశం ఉంటుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

అందుకే ఇప్పుడు హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పే వారు చాలా కష్టపడుతున్నారు అని అంటున్నారు. త్వరలోనే ఆ ఆపాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ కి కూడా యాస నేర్పే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ఎవరిని డబ్బింగ్ వద్దని ఎవరు నటిస్తే వాళ్ళకే డబ్బింగ్ చెప్పించాలి అని భావిస్తున్నాడు. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: