ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా లేకపోయినా సరే నిత్యా మీనన్ పేరు మాత్రం ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. పాప కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఆమె అవకాశాలు వచ్చినా రాకపోయినా సరే ఏదోక రూపంలో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఇక ఆమె విషయంలో దర్శక నిర్మాతలు కూడా చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆమె తో సినిమాలను చేయడానికి గానూ కొందరు దర్శక నిర్మాతలు ముందు నుంచి కూడా ఆసక్తి చూపిస్తారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఇప్పుడు ఆమెకు మళ్ళీ మన తెలుగు లో క్రేజ్ పెరుగుతుంది అని సమాచారం. ఆమె ఇటీవల తెలుగు సినిమాలకు చాలా వరకు  ఆమె దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆమె తెలుగు సినిమాల్లో చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజం ఎంత అనేది పక్కన పెడితే పుష్ప సినిమాలో ఆమె కు ఒక పాత్ర ఇస్తారు అని సమాచారం. ఆమె ఆ సినిమాలో ఒక వ్యాపార వేత్త కూతురిగా అల్లు అర్జున్ ని ప్రేమించే పాత్రలో నటిస్తారు అని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

ఆమెను నిర్మాత అడిగిన వెంటనే ఆమె ఓకే చేసింది అని సమాచారం. ఆమెకు ఆ పాత్ర ఇవ్వడానికి బన్నీ కూడా ముందుకు వచ్చాడు అని సమాచారం. అందుకే ఆమెకు ఆ పాత్ర ఇచ్చారు అని అంటున్నారు. ఆమె ఇప్పుడు ఆ సినిమా కోసం కష్టపడి పని చేస్తుందని తెలుగులో ఆమె చిత్తూరు యాస లో డబ్బింగ్ కూడా నేర్చుకుంటుంది అని సమాచారం. మరి ఏ విధంగా ఆమె డబ్బింగ్ చెప్తుంది అనేది తెలియడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన కథలో మార్పులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: