తెలుగులో స్టార్ డైరెక్టర్స్ చాలా మందే ఉన్నా.. సక్సెస్ లో ఉంది మాత్రం చాలా తక్కువ మందే. రాజమౌళి.. కొరటాల.. అనిల్ రావిపూడి.. సుకుమార్ మాత్రమే ఫామ్ లో ఉన్నారు. స్టార్స్ తో హిట్ ఇచ్చి.. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్స్ మాత్రం చాలా మందే ఉన్నారు. 

 

వినాయక్ హిట్ చూసి చాలాకాలమైంది. ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా..పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడంతో సక్సెస్ క్రెడిట్ అంతా మెగాస్టార్ కు వెళ్లిపోయింది. ఖైదీ నెంబర్ 150 తర్వాత సాయి ధరమ్ తేజ్ తో తీసిన ఇంటెలిజెంట్ ఫ్లాప్ అయింది. 

 

ఇంటెలిజెంట్ ఫ్లాప్ తర్వాత వినాయక్ బాలకృష్ణ మూవీకి కమిట్ అయ్యాడు. ఇంతలో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్స్ తో బాగా బిజీ అయిపోవడం.. ఆ తర్వాతైనా ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తే.. రవికుమార్, బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలకృష్ణతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత రవితేజ.. వెంకటేశ్ పేర్లు వినిపించాయేగానీ ఎనౌన్స్ చేయలేదు. రెండేళ్లుగా చేతిలో సినిమా లేకుండా గడిపేస్తున్నాడు వినాయక్. 

 

స్టార్స్ కు హిట్స్ ఇచ్చి ఓ వెలుగు వెలిగిన దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం డౌన్ ఫాల్లో ఉన్నాడు. ఎవరితో ఏ సినిమా తీసినా ఫ్లాపే. హిట్ కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. దూకుడు రిలీజ్ కాకుండానే ఎన్టీఆర్ శ్రీనువైట్లతో బాద్షా మూవీకి కమిట్ అయ్యాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆగడు.. బ్రూస్ లీ.. మాస్టర్.. అమర్ అక్బర్ ఆంటోనీ నిరాశపరిచాయి. ఈ డిజాస్టర్స్ తర్వాత శ్రీను వైట్ల పేరు మళ్లీ వినిపించలేదు. 

 

శ్రీనువైట్ల కనిపించి ఏడాది దాటింది. లాస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని 2018 నవంబర్ లో రిలీజ్ కాగా.. ఇంతవరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. ఆ మధ్య తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ మెంట్ ఉంటూనే కొత్త కథతో వస్తానని చెప్పాడు గానీ.. ఇంతవరకు ఈ సినిమా ఏమిటో.. హీరో ఎవరో ఈ దర్శకుడు ప్రకటించలేదు. 

 

ఐదేళ్ల క్రితం స్టార్ డైరెక్టర్స్ గా దమ్ము చూపించిన కొందరు దర్శకుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. వినాయక్.. శ్రీను వైట్ల అయితే.. రెండేళ్ల నుంచి హీరోల కోసం వెయిట్ చేస్తూనే ఉంటే మరికొందరు దర్శకులు సెట్స్ పై ఉన్న సినిమాలతో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: