అల వైకుంఠపురములో సినిమా వెళ్లిపోయి చాలా రోజులు అవుతోంది. థియేటర్లు కూడా డ్రైడేస్ పాటిస్తూ.. కొన్ని వారాలుగా ఉపవాసాలు చేస్తున్నాయి. అయితే సినిమా హాళ్లు మూతపడినా.. శుక్రవారాలు సందడి కనిపించకపోయినా.. వైకుంఠపురము జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. తమన్ గీతాలు రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. 

 

అల వైకుంఠపురములో ఆల్బమ్ కు ముందు ఆల్బమ్ తర్వాత అన్నట్టు మారిపోతోంది తమన్ గ్రాఫ్. సామజవరగమన నుంచి మొదలుపెట్టి సిత్తరాల సిరపడు వరకు ప్రతీ పాటను ప్రత్యేకంగా ఇచ్చిన తమన్సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ తీసుకున్నాడు. త్రివిక్రమ్ మాటలు, అల్లు అర్జున్ స్టైల్ ని డామినేట్ చేసేలా ట్యూన్స్ కట్టి ప్రేక్షకులను ఫిదా చేశాడు. 

 

అల వైకుంఠపురములో ఆల్బమ్ రిలీజై కొన్ని నెలలు కావొస్తోంది. కానీ ఈ పాటల మేజిక్ నుంచి బయటపడలేకపోతున్నారు మ్యూజిక్ లవర్స్. డ్రగ్స్ కు అడిక్ట్ అయినట్టు.. ఈ అల్బమ్ కు అడిక్ట్ అయిపోయారు.

 

ఆ అడిక్షన్ తోనే వైకుంఠపురము అల్బమ్ వందకోట్ల ప్లే అవుట్స్ క్రాస్ చేసింది. అన్ని ప్లాట్ ఫ్లామ్స్ లో కలిసి 1.13 బిలియన్ అవుట్స్ తో అదరగొట్టింది అల వైకుంఠపురము. 

 

అల వైకుంఠపురములో ఆల్బమ్ వందకోట్లకు పైగా ప్లే అవుట్స్ సాధించడంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. నా సినిమా ఆల్బమ్ వంద కోట్ల ప్లే అవుట్స్ దాటాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్. వైకుంఠపురముతో తమన్ నా కల నెరవేర్చాడు. చాలా ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ వంద కోట్ల ప్లే అవుట్స్ తో తమన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. 

 

మొత్తానికి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. అటు తమన్ మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఖుషీగా ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: