నటన వచ్చినా రాకపోయినా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి బ్యాగ్రౌండ్ ఉంటే చాలు అని ఎప్పటినుండో అనేకసార్లు నిరూపితమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆనవాయితీ సినీ రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది. టాలెంట్ ఉన్న వారికి సినీ అవకాశాలు రావడం చాలా తక్కువ కాగా... టాలెంట్ లేని బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోల బంధువులు, కొడుకులు, కుమార్తెలు మంచి కథా బలం ఉన్న సినిమాలలో నటించి వాళ్లు కూడా స్టార్స్ గా ఎదుగుతున్నారు. వాస్తవానికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారి సినిమాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఉదాహరణకి విజయ్ దేవరకొండ బ్యాక్ గ్రౌండ్ తో ఆనంద్ దేవరకొండ సినీ పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టి అభిమానుల అంచనాలను చేరుకోలేక ఒక్క సినిమాతోనే చతికిలబడ్డాడు. 


అలాగే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గౌరవం అనే చిత్రం తీసి తెలుగు ఇండస్ట్రీ లోనే ఎవరు కనివిని ఎరుగని డిజాస్టర్ ని తన సొంతం చేసుకున్నాడు. అతడి ని హీరోగా పెట్టి వరుసగా పది సినిమాలు తీసే సత్తా తన తండ్రి అల్లు అరవింద్ కి ఉన్నప్పటికీ... సముద్రమంతా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ... అల్లు శిరీష్ ని మాత్రం తెలుగు ప్రేక్షకులు హీరోగా ఆదరించడం లేదు. నాగార్జున చిన్న తనయుడు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోగా కొనసాగలేక పోతున్నాడు. దీన్నిబట్టి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా... నటనా ప్రతిభ, ఈరోజు సరిపడా క్వాలిటీ ఉంటేనే ప్రేక్షకులు వారిని ఆదరిస్తారని తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, రాణా దగ్గుబాటి, నాగశౌర్య తదితరులు బ్యాక్ గ్రౌండ్ ఉండి తమ టాలెంట్ ని ప్రేక్షకులకు రుచి చూపించి స్టార్ హీరోగా ఎదిగారు. అయితే వీరి తర్వాత ఇంకొక తరం వాళ్లు అనగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా సినిమారంగంలో అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నారు. 


పవన్ కుమారుడైన అఖీరా ని బాగా చదివించిన తర్వాత సినిమాల్లో ప్రవేశపెట్టాలో లేదా అనేది ఆలోచిస్తానని రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. మెగా కుటుంబ సభ్యులు అఖీరా సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు. అకీరా ఇప్పటికే రేణుదేశాయ్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో నటించి బాగానే అలరించాడు. తన కుమారుడు మోక్షజ్ఞ సినిమారంగంలో హీరోగా అడుగుపెడతాడని బాలకృష్ణ ఇప్పటికే స్పష్టం చేశాడు. మోక్షజ్ఞ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించలేదు. ఇతను హీరోగా కనిపించేందుకు విదేశాలకు వెళ్లి వ్యాయామశాలలో కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. శారీరకంగా దృఢంగా మారిన తర్వాత మోక్షజ్ఞ సినిమాల్లో నటిస్తాడని తెలుస్తోంది. ఇతను కోసం ఇప్పటికే ఎన్నో కథలు రెడీగా ఉన్నాయి. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ వన్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి అందరినీ బాగా మెప్పించాడు. మహేష్ బాబు కూడా తన కొడుకు సినిమాలలో అడుగుపెడతాడని  పరోక్షంగా చెప్తున్నాడు. ఐదారేళ్లలో వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడతారని సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు మంచి నటుడిగా పేరు పొందుతారో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: