అక్కినేని ఇంటి కోడలు సమంత ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిన విషయమే. సినిమా, ఫ్యామిలీ, ఫ్యాషన్, హెల్త్, సోషల్ మీడియా.. ఇలా ఏదైనా సమంత తన యాక్టివ్ నెస్ తో ఆకట్టుకుంటుంది. చలాకీ, చిరునవ్వు మాత్రమే సమంతకు తెలుసా అనే అనుమానం కూడా వస్తుంది. అంత కూల్ నెస్ సామ్ సొంతం. మొన్నీమధ్యే దగ్గుబాటి ఇంట జరిగిన రానా – మిహికా రోకా ఫంక్షన్ లో సందడి చేసింది. ఆ సందడి పూర్తవగానే సమంతలోని కొత్త కోణాన్ని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.

IHG

 

గ్రామీణంలో మాత్రమే కనిపించే వ్యవసాయం ఇప్పుడు పట్టణాల్లో కూడా కనిపిస్తోంది. అదేనండీ.. అర్బన్ ఫార్మింగ్. మందులతో పెంచే కూరగాయలు కంటే సేంద్రీయ పద్ధతిలో పెరిగే కూరగాయలే ఆరోగ్యానికి శ్రేష్ఠం అనే మాట వింటూనే ఉన్నాం కదా. సమంత ఇప్పుడు అదే చేస్తోంది. తన ఇంటి టెర్రస్ పై హోమ్ క్రాప్ లో భాగంగా వ్యవసాయం చేస్తోంది. ఓ ప్రత్యేకమైన ప్లేస్ లో చక్కగా అమర్చిన మట్టిలో విత్తనాలు జల్లుతోంది. సేంద్రీయ పద్దతిలో ఇంట్లోనే కూరగాయలు పెంచుతోంది. ‘మట్టిలో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అంటూ ఇంటి వ్యవసాయంపై తన ఇష్టాన్ని చెప్పుకుంది. ఈ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

IHG

 

లాక్ డౌన్ పరిస్థితుల్లో సమంత ఇంటి వ్యవసాయంపై దృష్టి పెట్టిందని ఈ పిక్ తో తెలిసిపోతోంది. సేంద్రీయ వ్యవసాయంపై నగర ప్రజల్లో ఎప్పటి నుంచో ఎన్నో ఎన్జీవో సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. సేంద్రీయ వ్యవసాయంపై ప్రభుత్వాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత ఇంటి వ్యవసాయం ఆకట్టుకుంటోంది. రంగస్థలంలో పల్లెటూరి అమ్మాయిగా చేసింది. ఈ పిక్ లో సిటీలో అభినవ రైతుగా సమంత పర్ఫెక్ట్ గా సరిపోయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: