దేశంలో కరోనా వైరస్ ఉన్న కొద్ది విజృంభిస్తోంది. ఊహించని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వాలు మరోపక్క పరిపాలన గాడిలో పెడతా కి రెడీ అవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా అమలు చేసిన లాక్ డౌన్ ఒకపక్క కొనసాగుతూనే మరోపక్క దశలవారీగా ఆంక్షలు సడలింపులు ఎత్తి వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో ఇప్పటివరకు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసినందుకు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.

IHG

గత 70 రోజులకు పైగా అనేక చర్యలు తీసుకుని మహమ్మారి కరోనా వైరస్ ముప్పు నుండి ప్రజలను రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి అంతా ఇంతా కాదని ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి క్లిష్ట సమయంలో మా అందరి జీవితాలను కుటుంబాలను రక్షించడానికి రాత్రింబవళ్లు పనిచేసిన వైద్య పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాట్సాఫ్ అని అన్నారు. అంతేకాకుండా పోలీసులకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.

IHG' to be remade in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> with actor <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VENKATESH' target='_blank' title='venkatesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>venkatesh</a> - The Hindu

వైరస్ పై పూర్తి అవగాహన రావటంతో మెల్లమెల్లగా ద్వారాలు తెరుచుకున్నాయి అని వెంకటేష్ వ్యాఖ్యానించారు. ప్రజెంట్ పరిస్థితులు అనుగుణంగా సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అంతేకాదు లాక్ డౌన్ మాత్రమే ముగింపునకు వచ్చింది అని, కరోనా వైరస్ కాదు అని అన్నారు.అందుచేత లాక్ డౌన్ సమయం లో మనం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నామో అవే, ఇపుడు కూడా పాటించాలి అని సూచించారు. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరించాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: