కొన్ని సినిమాలు క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. ఆ సినిమాలకు కాల భేదం లేదు, కాలాలు మారినా కూడా వాటి పరిమళం పోదు సరికదా ఇంకా కొత్తగా గమ్మత్తుగా అనుభవాలను పంచుతుంది. అలాంటి కోవలోకి వచ్చే సినిమావే సాగర సంగమం. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 37 సంవత్సరాలు. 1983 జూన్ 3న ఈ మూవీని విడుదల చేశారు.

 

మూవీ కళా తపస్వి కే విశ్వనాధ్ డైరెక్షన్లో వచ్చింది. అప్పటికే శంకరాభరణం సినిమా తీసి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన విశ్వనాధ్, అదే సినిమాను తన బ్యానర్లో తీసిన పూర్ణోదయా క్రియేషన్స్ వినూత్న స్రుష్టి ఈ సినిమాగా చెప్పాలి. విశ్వనాధ్ ఈ సినిమా కధను ఒక అధ్బుతమైన డ్యాన్సర్ విషాదాన్ని ద్రుష్టిలో పెట్టుకుని రాశారు.

 

జీవితంలో వేదిక ఎక్కని డ్యాన్సర్ తో విధి చెలగాటం ఆడితే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా. ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అటు తల్లిని కోల్పోయి ఇటు ప్రేమించిన మనిషి దూరం అయి, వ్యసనానికి బానిన అయినా తనలోని కళా త్రుష్ణను మాత్రం చంపుకోని అద్భుతమైన డ్యాన్సర్  క్యారక్టర్ని కమలహాసన్ పండించారు.

 

అతని జీవితానికి దగ్గరై అతనిలో కళాభినివేశాన్ని, ప్రేమను తట్టిలేపిన ప్రేయసి పాత్రలో జయప్రద అందంగా నటించారు. ఈ పాత్ర కోసమే మొదట జయసుధను విశ్వనాధ్ అడిగారట. అయితే అప్పటికి కొన్ని సినిమాలు కమిట్ అయి ఉండడం వల్ల జయసుధ నో చెప్పడంతో జయప్రదను తీసుకున్నారు. అలా ఓ అపురూప కళాఖండంలో నటించే చాన్స్ ని జయసుధ మిస్ అయితే జయప్రద లక్కీ అయింది. 

 

ఇక ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు ప్రాణం పోశాయి. నాద వినోదం నాట్య విలాసం అంటూ వచ్చే పాట, మౌనమేలనోయి అంటూ వచ్చే మరో పాట ఇప్పటికీ జనాల నోళ్ళల్లో నానుతూనే ఉంటాయి. నరుడి బతుకు నటన అంటూ నూతి గట్టి మీద కమల్ చేసిన నాట్యం నటన కూడా అపురూప సన్నివేశాలే. దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతున్నా ఈ సినిమా తావి వీడిపోదు, వాడిపోదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: