సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ రేట్ లో ఉన్న దర్శకులనైతే హీరోలు అస్సలు విడిచిపెట్టరు. వాళ్లతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తుంటారు. కొరటాల శివను కూడా మెగా కాంపౌండ్ ఇలాగే కట్టిపడేసుకుంటోంది. ఈ దర్శకుడితో వరుస సినిమాలు చేస్తున్నారు మెగా హీరోలు.

 

మెగా క్యాంప్ కొరటాల శివను విడిచిపెట్టడం లేదు. ఈ దర్శకుడితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు మెగా హీరోలు. సీినియర్లు,యంగ్ స్టర్స్ ఒకరి తర్వాత మరొకరు ఈ దర్శకుడితో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవిసినిమా చేస్తోంటే.. తర్వాత అల్లు అర్జున్ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్నాడు. 

 

కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మెగాబజ్ తో రూపొందుతోన్న సినిమా షూటింగ్ కు లాక్ డౌన్ తో బ్రేకులు పడ్డాయి. ఇక ఈ మెగా ప్రాజెక్ట్ సెట్స్ లో ఉండగానే.. కొరటాలను లాంచ్ చేశాడట అల్లు అరవింద్. 

 

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది ఈ సినిమా. ఇక ఈ మూవీ కంప్లీట్ అయ్యాక కొరాటల సినిమాలో జాయిన్ అవుతాడట బన్నీ. గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మూవీ కోసం కొరటాల శివకు 13కోట్లు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు సినీజనాలు. 


మొత్తానికి కొరటాల శివ మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తూ.. మెగా డైరెక్టర్ గా మారిపోతున్నాడు. గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్న కొరటాల.. చిరంజీవితో ఆచార్యను తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ సంపాదించుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: