మన తెలుగు లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో పాటు కాంట్రావర్శిస్ కూడా ఎక్కువ.. ఇంకా ఏదైనా ఈవెంట్స్ లో యాక్టర్స్ ఏమైనా మాట్లాడితే అవి కాంట్రవర్సీ అవుతాయి. కానీ కొన్ని సార్లు వాళ్ళు ఏమి మాట్లాడకపోయినా ఆ సినిమాలు అన్ని కాంట్రవర్సీగానే మారుతాయి. అలాంటి సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

అర్జున్ రెడ్డి.. 

 

విజయ్ డెన్వర్ కొండా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీగా మారింది. అంతేకాదు.. ఈ సినిమాలో లిప్ కిస్ లు ఎక్కువ ఉన్నాయి అని కొందరు రాజకీయ నాయకులూ సినిమా పోస్టర్లను చించేశారు కూడా.. అయితే నిజానికి వారు అలా చెయ్యడం వల్లే అర్జున్ రెడ్డి సినిమా పాపులర్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. 

 

లక్ష్మీస్ ఎన్టీఆర్...

 

లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎలా వచ్చారు అనేది తీస్తూ. ఎన్టీఆర్ చివరి రోజులు మరణం అంటూ చంద్రబాబు నాయుడుని ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కానీ సినిమా చూస్తే ఏం లేదు.. అయినా దీనిపై పెద్ద గొడవ అయ్యింది. 

 

కెమెరా మాన్ గంగతో రాంబాబు.. 

 

కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగ్స్ ఇందులో ఉన్నాయి అని.. తెలంగాణ మూమెంట్ ని కూడా చాలా వ్యతిరేకంగా చూపించారు అని సినిమా విడుదల కాకూడదు అని కాంట్రవర్సీ చేశారు.. కానీ సినిమా అయితే రిలీజ్ అయ్యింది. 

 

కమ్మరాజ్యంలో కడప బిడ్డలు.. 

 

సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. రామ్ గోపాల్ వర్మ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది.. ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఈ సినిమాపై టీవీలలో డిబేట్ లు, గొడవలు, పేరు మార్చడం అబ్బో చాలానే జరిగాయి. 

 

దువ్వాడ జగన్నాధం.. 

 

ఈ సినిమాలోని ఒడిలో బడిలో సాంగ్ చాలా పెద్ద కాంట్రవర్సీ క్రీట్ చేసింది. ఎంత అంటే మూవీ డైరెక్టర్ ఆ సాంగ్ లోని లిరిక్స్ కొన్ని చేంజ్ చేసే అంతగా. బ్రహ్మీని సంఘాలు ఈ ప్రొటెస్ట్ చేసాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: