సినిమా ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్న ఎందరో నిర్మాతలకు నిన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ ధియేటర్స్ చైన్ యజమాని సునీల్ నారంగ్ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఏషియన్ సినిమాస్ అధినేతగా అనేక ధియేటర్లను కలిగి ఉన్న ఈయన ఇలా ఎందుకు కామెంట్స్ చేసాడు అంటూ చాలామంది ఇండస్ట్రీ వర్గాల పెద్దలు ఆశ్చర్యపోతున్నారు.


కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తాము ధియేటర్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నామని చెపుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించే అన్ని నియమాలు పాటించగలము కానీ ప్రేక్షకుల మధ్య భౌతికదూరం కల్పించడానికి ధియేటర్ల సీటింగ్ లో మార్పులు చేయబోతున్నారు అన్నవార్తలు  గాసిప్పులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ధియేటర్స్ సీటింగ్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని గతంలో లాగే సీట్లు ఉండబోతున్నాయి అన్నక్లారిటీ ఇచ్చాడు.


అంతేకాదు ప్రేక్షకుల భౌతిక దూరంకోసం ధియేటర్లలో సీట్లను తగ్గిస్తే టిక్కెట్ల ఆదాయం తగ్గి తాము ధియేటర్లను నడపడం కష్టం అన్న అభిప్రాయం సునీల్ నారంగ్ అభిప్రాయ పడుతున్నాడు. ఇప్పటికే కరోనా భయాలతో జనం ధియేటర్లకు వస్తారా అని భయపడిపోతున్న పరిస్థితులలో ఇప్పుడు సునీల్ నారంగ్ అభిప్రాయం ప్రకారం ధియేటర్లు ఓపెన్ చేసినా జనం రావాలి అంటే ఇప్పట్లో జరిగే పనికాదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఇలా ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లను అనుమతిస్తూ విడుదల చేసిన కఠిన నియమ నిబంధనలు చూస్తే సినిమాను తీయడానికి ఎవరు ముందుకు రారు.


సినిమా షూటింగ్ కు సంబంధించిన సన్నివేశాలలో కౌగిలింతలు లిప్ లాక్ సీన్స్ పెళ్ళిళ్ళ సీన్స్ గ్రూప్ డాన్స్ లు ఇలా అనేక విషయాలు ఉండకూడదు అన్న నిబంధనలు పెడుతూ 16 పేజీల బుక్ లేట్ ను విడుదల చేసింది. ఇప్పుడు మన తెలుగురాష్ట్రాలలో కూడ ఇలాంటి కఠిన నియమ నివంధనలు అమలు చేస్తే సినిమాలు తీయడం ఎవరితరం కాదని ఒకవేళ కష్టపడి సినిమాలు తీసినా సునీల్ నారంగ్ చెప్పినట్లుగా ధియేటర్ల సీట్స్ మధ్య గ్యాప్ లేకుంటే కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయడం మానేసి ఖాళీగా కూర్చోవడం బెటర్ అనీ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరి ప్రముఖుల అభిప్రాయం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: