టాలీవుడ్ లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఒక సంచలనం. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కథ ఏ విధంగా ఉంటుంది. హీరోల నటన ఏ విధంగా ఉంటుంది... హీరోల పాత్ర ఏ విధంగా ఉంటుంది అసలు ఏ విధంగా సినిమాను దర్శకుడు రాజమౌళి తీసుకొస్తారు అంటూ కొందరు  సినిమా గురించి ఎక్కువగా చర్చలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ ఒక రేంజ్ లో ఉంటుంది అనేది కొన్ని కొన్ని వార్తల తర్వాతః చాలా మందికి ఒక క్లారితీ అయితే వచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని అంటున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఈ సినిమాలో వివాదాలు ఉండే అవకాశాలు చాలానే ఉన్నాయి అనేది కొందరి మాట. అవును సినిమాను వివాదాలు కచ్చితంగా వెంటాడే అవకాశం ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా హీరోల పాత్రల విషయంలో వివాదాలు ఉండే సూచనలు ఉన్నాయి అని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొమర౦ భీమ్ వారసులు అదే విధంగా... అల్లూరి సీతారామ రాజు వారసులు ఎక్కువగా ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. కథ ఏ స్థాయిలో ఉన్నా సరే ఈ సినిమాను కచ్చితంగా వివాదాలు వెంటాడే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలను కచ్చితంగా దర్శకుడు తీసేయాల్సి ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చెయ్యాలి అని చిత్ర యూనిట్ అంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమాను లాక్ డౌన్ తర్వాత షూట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: