సినిమా హీరోల పారితోషికాలు ఆకాశాన్నంటేలా ఉంటాయి. సినిమా నిర్మాణంలో ఎక్కువ భాగం హీరో రెమ్యునరేషన్ కే ఇచ్చే నిర్మాతలు కూడా ఉన్నారు. స్టార్ హీరోలకి మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలుగా మారిన చాలా మంది సినిమాల్లోకి రాకముందు ఏదో ఒక పనిచేసుకున్నవారే. అక్కడి నుండి సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన వారెందరో.. 

 


తెలుగులో స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి గారు మొదట చిన్న చితకా వేషాలు వేసారని తెలిసిందే. ఆ పాత్రలకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి కూడా విదితమే. బాలీవుడ్ హీరోల్లో కూడా ఇలాంటి హీరోలు ఉన్నారు. బాలీవుడ్ లో ఖాన్ త్రయం తర్వాత సూపర్ స్టార్ గా కొనసాగుతున్న వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. ప్రస్తుతం ఖాన్ త్రయాన్ని దూసుకుని ముందుకు వెళ్లాడనే చెప్పాలి. ఖాన్ లందరూ ఏడాదికి ఒక్క సినిమా తీయడానికే ఆపసోపాలు పడుతుంటే అక్షయ్ కుమార్ ఏడాదికి మూడు సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు. 

 


అది కూడా మెరుగైన సక్సెస్ రేటుతో కావడం విశేషం. గత ఏడాది సినిమాల ద్వారా అత్యధికంగా ఆర్జించిన వారిలో అక్షయ్ కుమార్ ముందున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 50 కోట్లకి పైగా తీసుకుంటున్న అక్షయ్ కుమార్, హీరో అవకముందు చాలా తక్కువ జీతానికే పనిచేసారట. బ్యాంకాక్ లోని ఒక ప్రముఖ హోటల్లో నెలకి 1500రూపాయల జీతానికి అక్షయ్ కుమార్ వెయిటర్ గా చేసాడట. వెయిటర్ నుండి చెఫ్ గా మారి అక్కడే పనిచేసాడట. అది కూడా తక్కువ జీతానికే. 

 

వెయిటర్ గా ప్రారంభమైన అక్షయ్ కెరీర్ స్టార్ హీరోదాకా ఎదిగింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ చిత్రం డైరెక్ట్ ఓటీటీ విడుదలకి సిద్ధం అవుతోందని అంటున్నారు. ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: