ఇండియన్‌ సినిమాకు దిశానిర్దేశం చేసిన స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఇండియన్‌ సినిమా మేకింగ్‌లో సమూల మార్పులు తెచ్చిన వర్మ ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా వర్మ సినిమా అంటేనే కేరాఫ్ వివాదంగా మారింది. ఎక్కువగా నిజ జీవిత కథలను ఎంచుకుంటున్న వర్మ వివాదాలనే కథాంశంగా ఎంచుకుంటున్నాడు. రాజకీయాల, ఫ్యాక్షన్‌ ఇలా ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక వివాదం ఉండేలా చూసుకుంటున్నాడు వర్మ.

 

ఒక రకంగా రక్త చరిత్ర సినిమాతో వర్మ డౌన్‌ ఫాల్‌ మొదలైందని చెప్పంది. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి, మద్దెల చెరువు సూరిల మధ్య ఉన్న వైరాన్ని కథాశంగా తీసుకున్నాడు. రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సినిమాలో ఒక భాగం విజయం సాధించగా రెండో భాగం దారుణంగా ఫెయిల్ అయ్యింది. తరువాత బెజవాడ పేరుతో మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలకు కారణమైంది.

 

ఆ తరువాత కూడా వంగవీటి సినిమాతో మరోసారి తెలుగు రాజకీయాలను కెలికాడు. వర్మగా తెరకెక్కించిన మరో భారీ వివాదాస్పద చిత్రం జీఎస్టీ. మెయిన్‌ స్ట్రీమ్ సినిమా కాకపోయినా ఈ సినిమా భారీ ప్రకంపనలు సృష్టించింది. పోర్న్‌ స్టార్‌తో పూర్తి స్థాయి న్యూడిటీ చూపించిన ఈ సినిమాపై పెద్ద దుమారమే రేగింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కింాడు వర్మ. ఈ సినిమా ఎన్నో వివాదాలు వాయిదాల తరువాత అతి కష్టమీద ఆంధ్ర ప్రదేశ్‌లో రిలీజ్ అయ్యింది.

 

ఆ కసితో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను తెరకెక్కించాడు వర్మ. ముందుగా ఈ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్డు అనే టైటిల్ పెట్టినా సెన్సార్ ఇబ్బందులు రావటంతో టైటిల్‌ను మార్చాడు. అయితే ఈ సినిమా కూడా ఎన్నో వివాదాలను తెర మీదకు తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: