స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన భారీ చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్‌. అప్పటి వరకు బన్నీ కెరీర్‌ లో నే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ‌పై దిల్ రాజు నిర్మించగా హరీష్ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బన్నీ బ్రహ్మాణుడి పాత్ర లో నటించాడు. అయితే ఈ సినిమాలో ఓ పాటు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ఏకంగా దర్శకుడు హరీష్ శంకర్‌ బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

 

డీజే దువ్వాడ జగన్నాథమ్‌ సినిమా లోని బడి లో మడి లో ఒడిలో అనే పాటో నమకం చమకం పదాలను వినియోగించటం పై బ్రహ్మణ కమ్యూనిటీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సినిమా లోని ఆ పాటను తొలగించాలని తీవ్ర స్థాయిలో ఆందోళనలు కూడా చేశారు. అయితే ఈ విషయం పై చిత్ర యూనిట్ చాలా వరకు సర్ధి చెప్పే ప్రయత్నం చేసింది. స్వయంగా బ్రాహ్మాణుడైన హరీష్‌, మీడియా ముందుకు వచ్చి సినిమా లోని పాట సిచ్యువేషన్ ‌ను వివరించాడు.

 

అయినా బ్రాహ్మణ సంఘాలు శాంతిచకపోవటంతో చివరకు దర్శకుడు పాట లోని ఆ పదాలను తొలగించాడు. అయితే ఈ వివాదాలు సినిమా కు ప్లస్ అయ్యాయాయనే చెప్పాలి. వివాదాలతో భారీగా పబ్లిసిటీ రావటంతో సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఇప్పటికీ దిల్ రాజు బ్యానర్ లో బిగ్గెస్ట్ హిట్స్‌ లో ఒకటిగా నిలిచింది డీజే దువ్వాడ జగన్నాథమ్‌. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ పెద్దగా కాంట్రవర్సీల జోలికి పోలేదు. భారీగా చిత్రాల్లో నటిస్తూనే ఉన్నా వివాదాలకు మాత్రం దూరం గానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: