2010 సంవత్సరం లో విడుదలైన కొమరం పులి సినిమా కి ఎస్. జే. సూర్య దర్శకత్వం వహించాడు. కొమరం పులి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటి గా పోలీస్ అవతారంలో కనిపించిన సినిమాగా పేరొందింది. ఈ చిత్రంలో నికిషా పటేల్, శ్రియా శరణ్ పవన్ సరసన నటించారు. ఈ సినిమా టైటిల్లో కొమరం అనే పేరు పెట్టినందుకు తెలంగాణాలో పెద్ద దుమారమే రేగింది. తెలంగాణ ఆదివాసి ఉపకులాల ఐక్య వేదిక సమితి నేత మెస్రం బాపురావు మాట్లాడుతూ కొమరం పులి టైటిల్ లో ఉన్న కొమరం పేరు గిరిజనోద్యమ నాయకుడు కొమరం భీమ్ కు కనెక్ట్ అవుతుందని... అతని పేరు తో సినిమా తీస్తే అతన్ని అవమానించడం తో పాటు తమ గిరిజన సంస్కృతిని కించపరిచినట్టు అవుతుందని అన్నారు. 

IHG'Jal ...
రోజా, రమ్య కృష్ణ కలిసి నటించిన సమ్మక్క సారక్క సినిమా పై కూడా ఆదివాసులు తమ వ్యతిరేకతను చూపించారు. దాసరి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాము దేవతల్లాగా భావించే సమ్మక్క సారక్కల ను తప్పుగా చూపిస్తుందని ఈ సినిమా పై తీవ్ర వ్యతిరేకత చూపించారు ఆదివాసులు.

IHG's 'komaram Puli' release in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JUNE' target='_blank' title='june-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>june</a> ending?

ఇకపోతే ఈ చిత్రం కేవలం పులి అనే టైటిల్ తో క‌న‌క‌ర‌త్న మూవీస్‌ కింద 2010 సంవత్సరం లో విడుదలైంది. సినిమా విడుదలైన రోజు మాత్రం కొమరం పులి అనే టైటిల్ ఉండగా... ఆ తర్వాత ఈ చిత్రానికి కొమరం తీసేసి పులి అనే టైటిల్ మాత్రమే ఉంచారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీత బాణీలను సమకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: