రాయలసీమ ప్రజా సంఘాల నేతలు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై మండిపడ్డారు. ఈ సినిమాలో చూపించిన విధంగానే రాయలసీమ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అంటే అతిశయోక్తి కాదు. రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం కాదని తమ ప్రజలు కత్తులు పట్టుకొని ఇతర ప్రజల ప్రాణాలను తీయరని రాయలసీమ ప్రజా సంఘాల నేతలు చెప్పారు. రాయలసీమ ప్రజలు నరుకుతారని, బాంబులు వేస్తారని ఎన్నో సినిమాల్లో చూపించిన ఇప్పటికీ తాము మౌనంగా ఉన్నామని... కానీ ఇకమీదట తాము మౌన ప్రేక్షకపాత్ర వహించమని హెచ్చరించారు.


హైదరాబాద్ సిటీ లో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి సభ్యులు ఒక మీడియా సమావేశం పెట్టి అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సంస్కృతి కి చెడ్డ పేరు తెచ్చే సన్నివేశాలను తక్షణమే తొలగించాలని లేకపోతే తర్వాతి పరిణామాలు భయంకరంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే తెలుగు సినిమాలు ఎప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఆడనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి రాయలసీమలో ఫ్యాక్షనిజం(రౌడీయిజం) అస్సలు లేదని, కొట్టుకోవడంలో చంపుకోవడం గొడవలు పెట్టుకోవడం లాంటివి రాయలసీమలో అప్పట్లో జరిగేవి కానీ ఇప్పుడు అవి ఏమీ జరగడం లేదని... ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని గౌరవించదగ్గ కొలువులు సంపాదించి తమ కుటుంబాలతో సంతోషకరమైన జీవితాలను గడుపుతున్నామని రాయలసీమ విద్యార్థుల సంఘం తెలిపారు. 


అసలు ఇప్పుడు రాయలసీమ లో ఎటువంటి ఫ్యాక్షన్ సంఘటనలు జరగకపోయినా... రాయలసీమలో గొడవలు జరుగుతున్నట్లు సినిమాలు తీసి కొంతమంది డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రయత్నించడం బాధాకరమని వారు తెలిపారు. కావాలంటే రాయలసీమ ప్రజలను పట్టి పీడిస్తున్న కరువు, నిరుద్యోగం, వలసల గురించి సినిమాలు తీస్తే తాము అభ్యంతరం తెలపమని స్పష్టం చేశారు. కాగా, ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా... పూజా హెగ్డే, ఈషా రెబ్బా, జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ను సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: