లక్ష్మీస్ ఎన్టీఆర్... ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత వివాదాస్పద సినిమా. ఈ సినిమా కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా వివాదమే. ఎన్టీఆర్ బయోపిక్  రూపంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి అడుగు పెట్టిన నాటి నుంచి జరిగిన ప్రతీ సన్నివేశం కూడా దర్శకుడు చూపించాడు. ఈ సినిమాలో వివాదాలు ఎక్కువగా ఉండటానికి కారణం అదే. ఈ సినిమాను అసలు చాలా మంది వద్దు అని చెప్పారు కూడా. అయినా సరే చిత్ర యూనిట్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఈ సినిమా ఒక వర్గానికి మద్దతు ఇస్తూ...

 

తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా ఉందని చాలా మంది అప్పట్లో కామెంట్ లు కూడా చేసారు. ఈ సినిమా ఎక్కువగా వివాదాలతో ఉంది అని దర్శకుడు వెనక్కు తగ్గకపోతే మాత్రం తాము ఏది చెయ్యాలో అది చేస్తామని చాలా మంది తెలుగు దేశం నాయకులు హెచ్చరికలు కూడా చేసారు. అయినా సరే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ సినిమా విషయంలో వెనక్కు తగ్గిన సందర్భం అనేది లేదు. ఇక ఈ సినిమా కథ మొత్తం లక్ష్మీ పార్వతి చెప్పిన విధంగానే ఉంది అని అలాగే వర్మ తీసారు అని వైసీపీ నాయకులు ఈ సినిమాను పైకి తీసుకొచ్చారు అని టీడీపీ నేతలు అప్పుడు ఆరోపణలు ఎక్కువగా చేస్తూ వచ్చారు. 

 

అయితే వర్మ మాత్రం ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా వెనక్కు మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. సినిమాలో ఏ సన్నివేశం కూడా ఆయన తీయకుండానే సినిమాను కొనసాగించారు. ఈ సినిమా హిట్ కాలేదు గాని ఒక సంచలనం మాత్రం సృష్టి౦చింది అని అయితే కచ్చితంగా చెప్పవచ్చు. వర్మ అప్పటి నుంచి కొన్ని వర్గాల కు బాగా టార్గెట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: