2002వ సంవత్సరంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఇంద్ర సినిమాలో చిరంజీవి ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే, ముఖేష్ ఋషి, ప్రకాష్ రాజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బగ్గిడి గోపాల్(బెజవాడ గోపాల్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి సూపర్ డూపర్ ఫ్యాక్షన్ డ్రామా చిత్రాలను తెరకెక్కించి అశేషమైన ఖ్యాతిని గడించిన బి. గోపాల్ చిరంజీవితో కలిసి మొట్టమొదటిగా ఇంద్ర అనే సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించి మెగాస్టార్ అభిమానులను అలరించాడు. 


ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు ఎన్నో సంవత్సరాలపాటు ప్రేక్షకుల మెదళ్ళలో మెదిలాయంటే అతిశయోక్తి కాదు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా డైలాగ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి పెద్ద సంచలనం అయ్యింది. దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ పాట లో చిరంజీవి వేసిన స్టెప్పులు అతనికి ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఈ స్టెప్పు చిరంజీవి సినీ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయేదని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్పటికీ దర్శకుడు బి.గోపాల్ తన పాత చిత్రాల నుంచి ఈ చిత్రాన్ని కాపీ కొట్టారని అనేకమైన కాంట్రవర్సీస్ తెరపైకి వచ్చాయి. 

 

సమరసింహా రెడ్డి నరసింహారెడ్డి చిత్రాలలో చూపించిన కథలను ఇంద్ర సినిమాలో సమకూర్చి... భాషా సినిమా లోని కొన్ని సన్నివేశాలను తీసుకొని ఇంద్ర ఫ్లాష్ బ్యాక్ ని దర్శకుడు బి.గోపాల్ రూపొందించాడని అప్పట్లో అనేకమైన విమర్శలు ఈ సినిమాపై గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై దర్శకుడు గోపాల్ మాట్లాడుతూ... ఇంద్ర సినిమా కథ పూర్తి భిన్నమైనదని... లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఆదరించేవారు కాదని సమర్థత ఇచ్చుకున్నాడు. వాస్తవానికి చిరంజీవి నటించిన 2-3 బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇతర సినిమాల నుండి పూర్తిగా కాపీ కొట్టిన వి అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన స్టాలిన్ సినిమా హాలీవుడ్ చిత్రానికి కాపీ కాగా... మొన్నీ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీనెంబర్150 కూడా తమిళ సినిమా నుండి స్ఫూర్తిగా తీసుకోబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: